E-Paper
Advertisement

Telangana Elections : నాడు వైద్యసేవ.. నేడు ప్రజాసేవ..

Telangana Elections : నాడు వైద్యసేవ.. నేడు ప్రజాసేవ..
Advertisement

Telangana Elections : రోగులకే కాదు.. సమాజానికి కూడా డాక్టర్లు ఎంతో అవసరమని నిరూపించాయి ఈసారి జరిగిన తెలంగాణ ఎన్నికలు. మునుపు ఎన్నడూలేని విధంగా ఈసారి ఏకంగా 15మంది డాక్టర్లు తెలంగాణ అసెంబ్లీకి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇందులో ఎక్కువ మంది కాంగ్రెస్ నుంచి గెలుపొందడం విశేషం. ఈ సారి కాంగ్రెస్ వెల్ ఎడ్యుకేటెడ్ వ్యక్తులకు టికెట్లు ఇచ్చి బరిలో నిలిపింది. అందులో భాగంగానే డాక్టర్లకు ప్రాధాన్యత ఇచ్చింది. 11 మంది డాక్టర్లు కాంగ్రెస్ తరుపు నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

డాక్టర్లుగా గెలుపొందిన వారిని నియెజవర్గాలకు చూసినట్లయితే..

Advertisement

డోర్నకల్ నియోజకవర్గంలో రామచంద్రునాయక్ కాంగ్రెస్ నుంచి ఘన విజయం సాధించారు. రామచంద్రు నాయక్ ఎమ్మెస్ జనరల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

అచ్చంపేటలో వంశీ కృష్ణ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఈయన కూడా ఎమ్మెస్ జనరల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తన ప్రత్యర్ధి గువ్వల బాలరాజుపై విజయాన్ని అందుకున్నారు.

Advertisement

మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మురళీ నాయక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెస్ జనరల్ సర్జన్‌ అయిన ఈయనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.

మానకొండూరు నియోజవర్గంలో కాంగ్రెస్ నుంచి డాక్టర్ సత్యనారాయణ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్ఠి రసమయి బాలకిషన్ పై విజయం సాధించారు. ఈయన కూడా ఎమ్మెస్ జనరల్ సర్జన్‌‌గా విధులు నిర్వర్తించారు.

సీనియర్ నేత మైనంపల్లి హన్మంత్‌రావు తనయుడు మైనంపల్లి రోహిత్ రావు కూడా ఎంబీబీఎస్ పూర్తి చేశారు. రోహిత్ కాంగ్రెస్ నుంచి మెదక్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు.

నారాయణపేట్‌లో మహిళా డాక్టర్ అయిన పర్ణికారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయాన్ని సాధించారు. ఈమె డాక్టర్ గా విధులు నిర్వహించేవారు. కాంగ్రెస్ ఈమెకు టికెట్ ఇవ్వడంతో ఘన విజయాన్ని కైవసం చేసుకున్నారు.

మరో డాక్టర్ సంజీవ్ రెడ్డి నారాయణఖేడ్ నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కించుకుని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. సంజీవ్ రెడ్డి పీడియాట్రీషన్‌గా వర్క్ చేస్తున్నారు.

ఇక చెన్నూర్ నియోజవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన కూడా MBBS పూర్తి చేసి డాక్టర్‌గా ఉన్నారు.

మరో అభ్యర్ధి పాల్వాయి హరీష్ సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. ఈయన ఎమ్మెస్ ఆర్థో చేశారు.

బీఆర్ఎస్ నుంచి కూడా డాక్టర్లుగా గెలిచిన వారున్నారు. ఇందులో భద్రాచలం నుంచి తెల్లం వెంకట్ రావు విక్టరీ సాధించారు. ఈయన ఎమ్మెస్ ఆర్థోగా విధులు పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.

మరోవైపు కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈయన న్యూరో సర్జన్ గా ఉన్నారు. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో తన సమీప ప్రత్యర్టి అరవింద్ పై విజయాన్ని నమోదు చేశారు.

ఇక నిజామాబాద్ రూరల్ నుంచి భూపతిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈయన ఎమ్మెస్ ఆర్థో పూర్తి చేశారు. కాంగ్రెస్ అవకాశం ఇవ్వడంతో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

మరో అభ్యర్ధి డాక్టర్ సంజయ్.. ఈయన జగిత్యాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎమ్మెస్ ఆప్తమాలజీ పూర్తి చేసిన ఈయనకు.. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో విజయం సాధించారు.

మట్టా రాగమాయి సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈమె పల్మనాలజిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు.

ఇక నాగర్‌కర్నూల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన కూచుకుళ్ల రాజేష్ రెడ్డి విక్టరీ సాధించారు. ఈయన కూడా డాక్టర్‌. ఎండీఎస్ పూర్తి చేశారు. ఇలా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన వారిలో 11 మంది డాక్టర్లు ఉండటం విశేషం.

మొత్తంగా గెలుపొందిన 15 మంది డాక్టర్లలో 11 మంది కాంగ్రెస్ నుంచి, ముగ్గురు బీఆర్ఎస్ నుంచి, ఒక్కరు బీజేపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×