E-Paper
Advertisement

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌తో డ్రెస్సింగ్ రూం పంచుకోనున్న అశ్విన్

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌తో డ్రెస్సింగ్ రూం పంచుకోనున్న అశ్విన్
Advertisement

R Ashwin’s team in MLC 2026:   ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs. Pakistan) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. పహల్గాం సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది. ముఖ్యంగా టీమిండియా అలాగే పాకిస్తాన్ క్రికెటర్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆసియా కప్ 2025 నుంచి పాకిస్తాన్ ప్లేయర్లతో ఎప్పుడు మ్యాచ్ ఆడినా కూడా మనోళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు. అయితే అలాంటి శత్రుదేశంతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునేందుకు సిద్ధమయ్యాడు టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (ASHWIN). పాకిస్తాన్ స్పీడ్ బౌలర్ హారీస్ రవూఫ్ (HARIS RAUF) లాంటి దుర్మార్గుడితో అశ్విన్ డ్రెస్సింగ్ రూమ్ పంచుకోనున్నాడు. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. అశ్విన్ దేశ ద్రోహి అంటూ ఫైర్ అవుతున్నారు. మొన్నటివరకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాపను ట్రోల్ చేసిన జనాలు… ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ ను ఆడుకుంటున్నారు.

Also Read: Shoaib Akhtar On Ind vs Pak Women’s T20 World Cup 2026 : మీ ఆట చూస్తే విర‌క్తి పుడుతోంది…కామెంట్రీ ప్యానెల్ లో కూర్చోలేక‌పోతున్నాం

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌తో డ్రెస్సింగ్ రూం పంచుకోనున్న అశ్విన్

Advertisement

అమెరికా వేదికగా మేజర్ లీగ్ క్రికెట్ (Major League Cricket (MLC)) మరో రెండు రోజుల్లోనే ప్రారంభం కానుంది. జూన్ 18వ తేదీ నుంచి జూలై 18 వ తేదీ వరకు అమెరికాలో ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించనున్నారు. మొత్తం 34 మ్యాచులు జరగనుండగా… తొలి మ్యాచ్ జూన్ 18వ తేదీన జరగనుండగా.. ఫైనల్స్ జూలై 18వ తేదీన ఉంటుంది. ఈ మేరకు షెడ్యూల్ ఇప్పటికే ఖరారు అయింది. ఇలాంటి క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ వివాదంలో చిక్కుకున్నాడు. ఈ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఆటగాడు హారీస్ రవూఫ్ ఉన్న జట్టులోనే రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరు క్రికెటర్లు లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ జట్టు (Los Angeles Knight Riders) తరఫున ఈ సీజన్ లో బరిలోకి దిగనున్నారు. అంటే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారీస్ రవూఫ్, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరు ఒకే డ్రెస్సింగ్ రూమ్ ను పంచుకోనున్నారు. ఈ లెక్కన ఇద్దరు షేక్ హ్యాండ్, హగ్గులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అశ్విన్ పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. పాకిస్తాన్ ఆటగాడు ఉన్న జట్టులో నువ్వెందుకు ఆడుతున్నావ్ ? అంటూ రవిచంద్రన్ అశ్విన్ ను ( R ashwin) దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అందుకే R. అశ్విన్ పై దేశ ద్రోహి ముద్ర వేసి ఆడుకుంటున్నారు.

Also Read:  Ind vs Pak Women’s T20 World Cup 2026 : పాక్ ప్లేయ‌ర్ల‌పై దీప్తి శర్మ మర్డర్ అటెమ్ట్ ? జేబులో స్ప్రే బాటిల్ పెట్టుకుని ప్లాన్

Advertisement

 

Related News

కామన్‌వెల్త్‌లో భార‌త్ దూకుడు..మ‌రో రెండు గోల్డ్ మెడ‌ల్స్‌

పాకిస్తాన్ ను ఓడించేందుకు వెస్టిండీస్ కుట్రలు.. వైట్ వాష్ చేసేందుకు మాస్ట‌ర్ ప్లాన్‌

వాడికి బౌలింగ్ చేయ‌డం కంటే, రిటైర్మెంట్ ఇవ్వ‌డం బెట‌ర్‌

మీరు ఎంత గింజుకున్నా తీసుకునేది లేదు…30 ఏళ్లు దాటిన ప్లేయ‌ర్లు మాకొద్దు

ఒరేయ్ న‌ఖ్వీ నీకు అస‌లు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా క‌ప్ దాస్తావురా ?

పాతాళానికి ప‌డిపోయిన అర్షద్ నదీమ్..80 మీట‌ర్లు కూడా విస‌ర‌లేదంటూ

టీమిండియా కోసం వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచ‌ల‌నం !

దొంగ‌చాటున పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు హ‌గ్గులు ఇవ్వ‌డం ఎందుకు? ద‌మ్ముంటే ఆ ప‌ని చేయండి

Big Stories

Advertisement
×