Tanveer Ahmed Reaction On Jemimah Rodrigues Hug: ఇంగ్లాండ్ వేదికగా ది 100 లీగ్ (The Hundred Women’s Competition 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. పురుషులతోపాటు మహిళల టోర్నమెంట్ ఒకేసారి జరుగుతోంది. అయితే ది 100 లీగ్ మహిళల టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా స్టార్ ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ) వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు (Fatima Sana ) జెమిమా రోడ్రిగ్స్ లైవ్ మ్యాచ్ జరుగుతుండగానే హగ్ ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ క్రమంలో ఫాతిమా సనాకు హగ్ ఇచ్చిన జెమిమా రోడ్రిగ్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆమెను దేశద్రోహి అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు ఇండియన్ ఫ్యాన్స్. అయితే ఈ హగ్ ఇన్సిడెంట్ పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) రియాక్ట్ అయ్యారు. పాకిస్తాన్ ప్లేయర్లతో హగ్గులు, షేక్ హాండ్స్ దొంగ చాటున ఇవ్వడం ఎందుకు ? దమ్ముంటే తమతో మ్యాచ్ ఆడి… ఇవన్నీ చేయండి అంటూ సవాల్ విసిరారు తన్వీర్ అహ్మద్.
ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సదరన్ బ్రేవ్ ఉమెన్ వర్సెస్ బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఉమెన్
జట్ల మధ్య 13వ మ్యాచ్ జరిగింది. ఈనెల 30వ తేదీన సౌతాంప్టన్ లోని రోజ్ బౌల్ వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో అద్భుతంగా రాణించిన సదరన్ బ్రేవ్ ఉమెన్ జట్టు 24 పరుగులు తేడాతో విక్టరీ అందుకుంది. సదరన్ బ్రేవ్ ఉమెన్ జట్టు తరుపున ఆడుతున్న జెమిమా రోడ్రిగ్స్… మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఉమెన్ జట్టు తరఫున ఆడుతున్నావు పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు హాగ్ ఇచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.
పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు టీమిండియా స్టార్ ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ) హగ్ ఇచ్చిన నేపథ్యంలో.. తన్వీర్ అహ్మద్ సీరియస్ అయ్యారు. దొంగ చాటున ఇలా హగ్గులు ఇవ్వడం ఎందుకని ఫైర్ అయ్యారు. దమ్ముంటే తమ పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్ ఆడి.. షేక్ హాండ్స్ తో పాటు హగ్గులు ఇచ్చుకోండి అంటూ చురకలు అంటించారు. కానీ ఇండియన్ అభిమానులకు తెలియకుండా రహస్యంగా ఇలా హగ్గులు, షేక్ హ్యాండ్ లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. బీసీసీఐ ఇచ్చే డబ్బులు తీసుకుంటూ.. ఇండియన్ అభిమానులనే క్రికెటర్లు మోసం చేస్తున్నారని ఆగ్రహించారు.
Also Read: Trolls On Virat Kohli: లండన్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవమానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !
Everyone debating if Fatima Sana and jemimah Rodrigues would shake hands and they straight up HUGGED?!😭😭🙏
Keep politics out of sports FOREVER. pic.twitter.com/XCE2lswGlg
— A. (@anhnjo) July 30, 2026