IND Vs PAK : ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్ 4 మ్యాచ్ ఈనెల 21న జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా పలు వివాదస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ ‘ఆపరేషన్ సింధూర్’ లో భారత్ 6 ఫైటర్ జెట్లను కోల్పోయిందని వేళ్లతో సంజ్ఞలు చేయడం.. అందుకు టీమిండియా ఫ్యాన్స్ కోహ్లీ.. కోహ్లీ అంటూ సమాధానం చెప్పారు. తాజాగా హారిస్ రవూఫ్ కి టీమిండియా బౌలర్ అర్ష్ దీప్ సింగ్ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. జెట్స్ ని నీ తొక్కలో మడిచి పెట్టుకోరా..? అని కౌంటర్ ఇవ్వడంతో అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ
మరోవైపు పాకిస్తాన్ అభిమానులు అర్ష్ దీప్ సింగ్ కి కౌంటర్ ఇస్తున్నారు. కేవలం ఒక్క మ్యాచ్ లోనే ఆడావు. మిగతా మ్యాచ్ లన్ని ఆడలేదు. గంభీర్ వల్ల నీ కెరీర్ నాశనం అవుతుందని కామెంట్స్ చేయడం గమనార్హం. మరోవైపు హారిస్ రవూఫ్ కి అర్ష్ దీప్ సింగ్ మడిచి.. అనే సైగలో బూతుగా వాడాడని కొందరూ పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అర్ష్ దీప్ సింగ్ మాత్రం పాక్ ఆటగాడికి కౌంటర్ స్ట్రాంగ్ గానే ఇచ్చాడు. మరోవైపు లీగ్ దశలో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ కి భారత జట్టు కరచాలన వివాదం కొనసాగుతోంది. సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ తరువాత.. టీమిండియా ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. భారత ఆటగాళ్ల నిర్ణయం పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. టోర్నీ నుంచి వైదొలుగుతామని బెదిరించింది.
ఇక సెప్టెంబర్ 21న దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన 2వ మ్యాచ్‌లో కూడా భారత ఆటగాళ్లు కరచాలనం చేయలేదు. మ్యాచ్ ముగియగానే, టీం ఇండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లారు. ఈసారి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిన టీం ఇండియా ఆటగాళ్లను కోచ్ గౌతమ్ గంభీర్ తిరిగి పిలిపించాడు. పాక్ ఆటగాళ్లను పట్టించుకోని భారత ఆటగాళ్లు అంపైర్లతో కరచాలనం చేయడం మర్చిపోయారు. భారత జట్టు ఆటగాళ్లు ఈ మర్యాద పాటించాలని గౌతమ్ గంభీర్ ఆదేశించారు. దీని ప్రకారం, భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ నుంచి తిరిగి వచ్చి అంపైర్లతో కరచాలనం చేశారు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ బ్యాట్ ని గన్ తో పట్టుకొని సెలబ్రేషన్స్.. మరోవైపు టీమిండియా-పాకిస్తాన్ ఆటగాళ్లు ఒకరిపై మరొకరూ దూషించుకోవడం ఇలా రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వివాదాలు కాకుండా ఉండాలంటే.. ఇవాళ పాకిస్తాన్ జట్టు శ్రీలంక చేతిలో ఓటమి పాలవ్వాలని కొందరూ టీమిండియా అభిమానులు పేర్కొనడం గమనార్హం. ఆసియా కప్ 2025 లో సెప్టెంబర్ 21న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచే ఈ రెండు జట్ల చివరి మ్యాచ్ అని.. పాకిస్తాన్ ఫైనల్ కి వచ్చే అవకాశమే లేదని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.