Asia Cup 2025 : ఆసియా కప్ 2025 లో గ్రూపు ఏలో ఇప్పటికే టీమిండియా సూపర్ 4 కి అర్హత సాధించింది. రెండో జట్టు కోసం ఇవాళ పోరు జరుగనుంది. పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ మధ్య పోరులో పాకిస్తాన్ విజయం సాధిస్తే.. పాకిస్తాన్.. యూఏఈ విజయం సాధిస్తే.. యూఏఈ సూపర్ 4 కి అర్హత సాధిస్తుంది. అయితే ఇవాళ రాత్రి 8 గంటలకు పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ పోరు గ్రూపు ఏ ఆసక్తికరంగా మారనుంది. ఇప్పటికే టీమిండియా చేతిలో ఓటమి చెందిన పాకిస్తాన్.. ఒమన్ చేతిలో విజయం సాధించిన యూఏఈ బరిలోకి దిగుతున్నాయి. మరోవైపు ఈ రెండు జట్లు కూడా టీమిండియా చేతిలో ఓడిపోయాయి.
Also Read : BAN Vs AFG : పోరాడి ఓడిన అప్గానిస్తాన్.. సూపర్ 4 లోకి బంగ్లాదేశ్ అడుగు పెట్టినట్టేనా..?
మరోవైపు పాకిస్తాన్ జట్టు మ్యాచ్ రిఫరీ ఆండి పై క్రాప్ట్ ద్వారా పాకిస్తాన్ తో సంప్రదాయ టాస్, మ్యాచ్ తరువాత షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం పై భారత్ వైఖరీ గ్రూపు ఏ పై క్యాస్కేడింగ్ ప్రభావాన్ని చూపించింది. భారత్ తో ఓటమి పాలైన తరువాత మ్యాచ్ ప్రదర్శనకు హాజరు కాకుండా పాకిస్తాన్ నిరసన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ఆడబోయే ఆటలకు పై క్రాప్ట్స్ ని తొలగించాలని.. మ్యాచ్ అధికారి అతనే అయితే తాము ఆడబోమని స్పష్టం చేసింది పీసీబీ. దీంతో పీసీబీ డిమాండ్ ను ఐసీసీ అధికారికంగా కొట్టేసింది. టీమిండియా చేతిలో ఓటమి చెందిన పాకిస్తాన్ జట్టు ఎలాగైనా యూఏఈతో విజయం సాధించి.. మరోసారి టీమిండియాతో తలపడాలని భావిస్తోంది. ఆతిథ్యం ఇచ్చిన యూఏఈ జట్టు కూడా తొలిసారి సూపర్ 4లోకి ప్రవేశించాలని భావిస్తోంది. కానీ పాకిస్తాన్ చేతిలో యూఏఈ విజయం సాధించడం కొంచెంకష్టంతో కూడుకున్న పనే.
టీమిండియా మాదిరిగా పాకిస్తాన్ జట్టులో స్పిన్నర్ల ధాటికి యూఏఈ కుప్పకూలిపోతుందని పలువురు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. యూఏఈ ఏమైనా మ్యాజిక్ చేస్తే.. తప్ప పాకిస్తాన్ పై విజయం సాధించదు. టీమిండియా మాదిరిగా పాకిస్తాన్ జట్టులో స్పిన్నర్ల ధాటికి యూఏఈ కుప్పకూలిపోతుందని పలువురు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. యూఏఈ ఏమైనా మ్యాజిక్ చేస్తే.. తప్ప పాకిస్తాన్ పై విజయం సాధించదు. మరోవైపు వన్డే వరల్డ్ కప్ 2023, టీ-20 వరల్డ్ కప్ 2024, 2025 ఛాంపియన్స్ ట్రోఫీల్లో పాకిస్తాన్ జట్టు మూడేళ్లలో ప్రతీ సారి తొలి రౌండ్ లోనే నిష్క్రమించింది. అయితే పాకిస్తాన్ జట్టు చాలా మంది కెప్టెన్లు, ఆటగాళ్లను మార్చింది. కానీ మెరుగుపడలేదు. ప్రస్తుతం ఆసియా కప్ 2025లో కూడా యూఈఏతో ఓటమిపాలైతే అదే హిస్టరీ రిపీట్ కానుంది. టీమిండియా చేతిలో ఓటమి తరువాత సల్మాన్ అలీ అఘా జట్టు మొదటి రౌండ్ లో నష్క్రమించే అంచున ఉంది. యూఏఈతోతో ఓటమి చెందితే అదే రిపీట్ అవుతుంది. విజయం సాధిస్తే… సూపర్ 4 కి అర్హత సాధిస్తుంది.
ఇవాళ జరిగే పోరులో పాకిస్తాన్ విజయం సాదిస్తుందా..? లేదా యూఏఈ విజయం సాధిస్తుందా..? అనేది మరికొద్ది గంటల్లోనే తేలనుంది.