Illu Illalu Pillalu Today Episode September 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ ఒంటరిగా నడుచుకుంటూ వస్తోంది. ప్రేమ నా కున్నది ఒకటే దారి ఆ కళ్యాణ్ చెప్పినట్టు వాడి కోరిక తీర్చాలని అనుకుంటుంది. నేను అర్జెంటుగా బయటకు వెళ్లాలి అని ప్రేమ వెన్నపోతుంటే ధీరజ్ నువ్వు ఎక్కడికైనా చెప్పు నేను డ్రాప్ చేస్తానని అంటాడు.. ఎక్కడికి వద్దు నేను వెళ్తాను అని ప్రేమ ఎంత చెప్పినా సరే ఈరోజు మాత్రం మాట వినకుండా నేను నిన్ను డ్రాప్ చేస్తాను బైక్ ఎక్కువ అని అంటారు. కళ్యాణ్ రమ్మన్న చోటికి దగ్గరలో ప్రేమ ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపోరా అనేసి అంటుంది. ప్రేమ చెప్పినట్లే ధీరజ్ ఒకచోట డ్రాఫ్ చేస్తాడు. అయితే ప్రేమ ధీరజ్ ఎంత అడుగుతున్నా సరే ఏమి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ప్రేమ నడుచుకుంటూ ఆ కళ్యాణ్ దగ్గరికి వెళ్లిపోతుంది. తిరుపతి బియ్యం బస్తాల గురించి లెక్కలు వేస్తూ ఉంటాడు. అలాగే తన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు.. ఇక్కడైతే పెళ్లి కాదు ఏ అమెరికాలోనో ఆఫ్రికాలోనైతే నా పెళ్లి అవుతుంది అని అనుకుంటూ ఉంటాడు. నర్మద ప్రమోషన్ గురించి ఇంట్లో చెప్తుంది. భాగ్యం ఆనందరావు కూడా నర్మదని పొగడడంతో శ్రీవల్లి షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శ్రీవల్లి నర్మదని మీరు పొగుడుతున్నారేంటి అని ఇంట్లో ఉన్న వస్తువులను పగలకొడుతూ అరుస్తుంది. ఇప్పుడు నువ్వు ఇంత కంగారు ఎందుకు పడుతున్నావు అమ్మడు నర్మదని పొగడం నీకేం ఇబ్బంది జాబ్ తెచ్చుకునింది ప్రమోషన్ కొట్టింది అంతే కదా దాని గురించి నువ్వు అంతగా బాధపడాల్సిన అవసరం ఏంటి అని భాగ్యం అంటుంది… ఆనందరావు కూడా ఈ డబ్బులు తీసుకొని నువ్వు నీ సమస్యను పరిష్కరించుకో మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు నీకే సంబంధం లేదు అని అంటారు. శ్రీవల్లి ఆ పది లక్షలు చూడగానే తన కోపం అంతా ఆవిరి అయిపోతుంది.
ఆ తర్వాత నువ్వు ఏమి చేస్తున్నావు ముందు నీకు కాపురంలో నిలబెట్టుకో.. అల్లుడు గారికి నీకు మధ్య దూరం పోవాలంటే నువ్వు కచ్చితంగా ఈ పని చేయాల్సిందే అని భాగ్యం ఒప్పించేస్తుంది. అటు ధీరజ్ ప్రేమని ఎందుకు ఇంత పెద్ద సమస్యని నా దగ్గర చెప్పుకోవడం లేదు అని అడుగుతాడు. ఇన్ని రోజులు తిండి తిప్పలు మానేసి నీలో నువ్వే ఒంటరిగా బాధపడుతున్నావా అని అడుగుతాడు.. ధీరజ్ ఎంతగా అడుగుతున్నా సరే ప్రేమ మాత్రం నీకెందుకు చెప్పాలి అని అంటుంది.
నా సమస్యను నీకు చెప్పాలని వస్తే నువ్వు ఏమన్నావ్ కళ్యాణ్ గాడి వల్లే నేను ఇలా ఇరుక్కున్నాను అని ఎంతో బాధగా చెప్పావు అందుకే నీకు చెప్పాలని అనిపించలేదు. ఆరోజు నేను రాకుండా ఉంటే ఈ రోజు నేను నీ దగ్గర ఉండకపోయే వాడిని అని నువ్వు అన్నావు కదా.. అది ఆలోచించవా నన్ను ఎందుకు ఊరికే ప్రదేపదే అంటావు అని ధీరతో ప్రేమ అంటుంది.. ఏదో బలవంతంతో పెళ్లి చేసుకున్న తప్ప నేనంటే నీకు కనీసం ఇష్టం కూడా లేదు అని ప్రేమ ధీరజ్ ని అడుగుతుంది.
ప్రతి విషయానికి నాతో గొడవపడి నువ్వు నీకోసం ఈ ధీరజ్ ఉన్నాడు అని నీకు అనిపించలేదా అని ధీరజ్ అడుగుతాడు… ప్రేమ మాత్రం నేను నీకు వస్తువుతో సమానం కదా ఇక నీతో నేను ఎలా చెప్పుకోవాలి అని అంటుంది. ఆ మాటతో ధీరజ్ ప్రేమ చెయ్యిని వదిలిపెడతాడు. అటు శ్రీవల్లి ఆనందరావు భాగ్యం ముగ్గురు చందు దగ్గరికి వెళ్లి మేము చాలా మంచి వాళ్ళం బాబు ఏదో మోసపోయాం తప్ప.. మిమ్మల్ని మోసం చేయాలని ఏ రోజు అనుకోలేదు.. ఈ పది లక్షల తీసుకోండి దీనివల్ల మీరు అమ్మాయి దూరంగా ఉన్నారని తెలుస్తుంది. కాసింత అమ్మాయి మీద అరిసినారని అమ్మాయి చెప్పింది అని భాగ్యం అంటుంది.
Also Read: గీత పై బాస్ సీరియస్.. పల్లవికి మైండ్ బ్లాక్ దెబ్బ.. పార్వతికి షాకిచ్చిన అక్షయ్..
నేను డబ్బులు తీసుకున్న సేటు అలాంటివాడు నన్ను అంతగా టార్చర్ చేశాడు. కాబట్టే నేను వల్లి తో అలా మాట్లాడిన తప్ప వల్లి అంటే నాకు ప్రాణం అని చందు అంటాడు.. ఆ తర్వాత వల్లిని భాగ్యం బయటకు తీసుకొని వస్తుంది. అయితే అక్కడే ఉన్న భద్ర విశ్వం చూసి వల్లితో నవ్వుతూ పలకరిస్తారు. వాళ్ళు చెప్పినట్టు విను నీకు కావాల్సింది వచ్చింది కదా నీకు కాపురం కి ఇక్కడ డోకా లేదు అని భాగం చెప్తుంది. భద్ర అనుకున్న ప్లాన్ సక్సెస్ అవడంతో విశ్వం ఇద్దరు కూడా సంతోషంలో మునిగిపోతారు. వల్లి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..