E-Paper
Advertisement

Asia Cup : ఒకే ఓవర్ లో 4 వికెట్లు.. సిరాజ్ షో.. 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్..

Asia Cup :  ఒకే ఓవర్ లో 4 వికెట్లు.. సిరాజ్ షో.. 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్..
Advertisement

Asia Cup : ఆసియా కప్ ఫైనల్ లో భారత్ బౌలర్లు చెలరేగారు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన శ్రీలంకకు తొలి ఓవర్ 3వ బంతికే బుమ్రా షాకిచ్చాడు. ఓపెనర్ కుశాల్ పెరీరా (0) ను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత మహ్మద్ సిరాజ్ విశ్వరూపం ప్రదర్శించాడు. 4 ఓవర్ లో 4 వికెట్లు నేలకూల్చి లంకను వారి సొంత గడ్డపై బెంబేలెత్తించాడు.

నాలుగో ఓవర్ తొలి బంతికి నిస్సాంక (2) జడేజా క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. 3,4 బంతుల్లో సదీర సమరవిక్రమ (0), అసలంక (0)ను పెవిలియన్ కు పంపాడు. ఆ ఓవర్ చివరి బంతికి ధనుంజయ డిసిల్వా (4) అవుట్ కావడంతో శ్రీలంక 12 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. అదే స్కోర్ వద్ద కెప్టెన్ శనక (0)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు.

Advertisement

శ్రీలంక స్కోర్ 33 పరుగుల వద్ద సిరాజ్ మరోసారి దెబ్బకొట్టాడు. చాలాసేపు ఒంటరి పోరాటం చేసిన కుశాల్ మెండిస్ (17) 7వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత శ్రీలంక ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. దునిత్ వెల్లలాగే( 13)ను హార్థిక్ పాండ్యా అవుట్ చేయడంతో 40 పరుగులకు లంక 8 వికెట్లు కోల్పోయింది. చివరి రెండు వికెట్లు ప్రమోద్ ముధుశాన్ (1), మతీశ పతిరన ( 0)ను కూడా హార్ధిక్ పాండ్యానే పడగొట్టాడు. దీంతో శ్రీలంక 15.2 ఓవర్లలోనే 50 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ కు 6 వికెట్లు, పాండ్యాకు 3 వికెట్లు, బుమ్రాకు ఒక వికెట్ దక్కాయి.

శ్రీలంక జట్టులో 5 బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఇద్దరు మాత్రమే రెండెంకల స్కోర్ చేశారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×