E-Paper
Advertisement

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!
Advertisement

Shahid Afridi Reaction On Team India: టీమిండియా వర్సెస్ జింబాబ్వే ( Zimbabwe vs India) మధ్య ఇవాల్టితో టి20 సిరీస్ ( India tour of Zimbabwe 2026 ) ముగిసిన సంగతి తెలిసిందే. ఈ రెండు జ‌ట్ల మధ్య నాలుగు రోజుల కిందట మూడు టి20 సిరీస్ ప్రారంభమైంది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా.. జింబాబ్వే జట్టును వైట్ వాష్ చేసింది. వరుసగా జరిగిన మూడు టి20లో భారత్ విజయం సాధించింది. ఈ క్రమంలో 3-0 తేడాతో సిరీస్ కూడా కైవసం చేసుకుంది. దీంతో శ్రేయస్ అయ్యర్ సేనపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం విషం కక్కుతూనే ఉన్నారు.

Also Read : Robin Uthappa On Babar Azam:  బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

Advertisement

తాజాగా షాహిద్ అఫ్రిది (Shahid Afridi) కూడా ఈ అంశంపై స్పందించారు. పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు… దమ్ముంటే పాకిస్తాన్ క్రికెట్ జట్టుపైన ద్వైపాక్షిక సిరీస్ లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. అంతేకాదు తమ పాకిస్తాన్ జట్టుకు వచ్చి టీమిండియా ఆడాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ గడ్డపైన టీమిండియా గెలిస్తేనే అప్పుడు వరల్డ్ నెంబర్ వ‌న్ జట్టు అవుతుందని వ్యాఖ్యానించారు షాహిద్ అఫ్రిది (Shahid Afridi). దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

టీమిండియా ప్లేయర్లకు విదేశీ గడ్డలపై ఆడడం చేతకాదు

టీమిండియా బాగా ఆడితే విమర్శలు చేయడం.. బాగా ఆడకపోతే హేళన చేయడం పాకిస్తాన్ క్రికెటర్లకు అలవాటైపోయింది. ఏదేమైనా సరే… టీమిండియా జట్టును సోషల్ మీడియాలో విలన్ ను దిశగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే జింబాబ్వే పైన మూడు టి20 సిరీస్ ను గెలిచిన టీమిండియాను ఉద్దేశించి.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ప్లేయర్లకు విదేశీ గడ్డలపై ఆడడం చేతకాదని హేళన చేశారు. అయినప్పటికీ జింబాబ్వే పైన గెలవడం వెనుక కుట్రలు ఉన్నాయని బాంబు పేల్చాడు. పసికూన జింబాబ్వే జట్టు పైన గెలవడం కాదని.. దమ్ముంటే పాకిస్తాన్ జట్టు పైన గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.

Advertisement

దీనికోసం పాకిస్తాన్ గడ్డపై టీమ్ ఇండియా ప్లేయర్లు అడుగుపెట్టాలని కోరారు. పాకిస్తాన్ గడ్డపై గెలిస్తేనే టీమ్ ఇండియాకు మంచి వ్యాల్యూ ఉంటుందన్నారు. ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు. టీమిండియాకు అనుకూలంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మొదటి నుంచి వ్యవహరిస్తుందని బాంబు పేల్చారు. ఐసీసీ బాస్ పదవిలో జై షా ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా ప్లేయర్లు రెచ్చిపోతున్నారని ఫైర్ అయ్యారు. దానికి తగ్గట్టుగానే జై షా అండదండలు ఉంటున్నాయని తెలిపారు. వెంటనే అతని పదవి తొలగించాలని కూడా డిమాండ్ చేశారు షాహిద్ అఫ్రిది.

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

Related News

2023 ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియాను గెలిపించేందుకు కుట్ర‌లు చేశారు!

పాకిస్తాన్ ప‌రువు తీసిన శుభ్‌మన్ గిల్…అంద‌రూ క‌లిసి చేసిన ర‌న్స్ ఒక్క‌డే చేశాడుగా!

పాకిస్తాన్ ను నాశ‌నం చేసింది మైక్ హెసనే..వాడు కూడా ఇండియ‌న్ ఏజెంటే !

పీక‌ల‌దాకా తాగుతూ నైట్ క్ల‌బ్ లో దొరికిన 9 మంది పాకిస్తాన్ క్రికెట‌ర్లు

125 స్పీడ్ తో బౌలింగ్ చేస్తే, నా ఆస్తులు రాసిస్తా… బ్రెట్ లీకి షోయ‌బ్ అక్త‌ర్ స‌వాల్

నా చేత‌కాని త‌నం వ‌ల్లే.. ఆ క్యాచ్ నేల పాలైంది – మాలిక్

పాకిస్తాన్ జ‌ట్టు నుంచి పిలుపు..అంత‌లోనే ఫోన్ స్విచ్ ఆఫ్, పాస్ పోర్టు లేదు..కానీ కట్ చేస్తే

శార్దుల్ ఠాకూర్ కు బౌలింగ్ వ‌ద్ద‌ని మొత్తుకున్నా ధోని విన‌లేదు – హ‌ర్భ‌జ‌న్

Big Stories

Advertisement
×