BigTV English

Aus vs Oman Match Highlights : గెలిచిన ఆస్ట్రేలియా.. ఓడిన ఒమన్

Aus vs Oman Match Highlights : గెలిచిన ఆస్ట్రేలియా.. ఓడిన ఒమన్

Aus vs Oman Match Highlights T20 World Cup : టీ 20 ప్రపంచకప్ లో చిన్న జట్టు ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. వెస్టిండిస్ లోని బార్బడోస్ లో జరిగిన మ్యాచ్ లో చిన్నజట్టు అయినా ఒమన్ గట్టి పోటీ ఇచ్చింది. ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించకుండా నిలువరించింది.


టాస్ గెలిచిన ఒమన్ మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఒమన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. దీంతో 39 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఒమన్ కి ఓపెనర్లు ఇద్దరూ నిరాశపరిచారు. కశ్యప్ ప్రజాపతి (7), ప్రతీక్ అథవాలె గోల్డెన్ డకౌట్ కావడంతో మ్యాచ్ గతి తప్పింది. తర్వాత వచ్చిన ఖాలిద్ ఖైల్ (8) నిరాశపరిచాడు. అయాన్ ఖాన్ ఒక్కడే నిలిచాడు. 30 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. తనకి సపోర్టుగా మెహ్రాన్ ఖాన్ (27) నిలిచాడు. అందువల్ల ఆ మాత్రం స్కోరు అయినా వచ్చింది.


Also Read : వార్ వన్ సైడ్ : తొలిమ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం

తర్వాత ఇద్దరు డక్ అవుట్లు అయ్యారు. చివర్లో షకీల్ (11) , కలీముల్లా (6) చేసి అవుట్ అయ్యారు. ఎట్టకేలకు 9 వికెట్లకు 20 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే ఒమన్ చేయగలిగింది. బౌలర్లు కష్టపడినా బ్యాటర్లు గెలిపించలేకపోయారు. తక్కువ స్కోరు మ్యాచ్ ని చేజేతులారా పోగొట్టుకున్నారనే కామెంట్లు వినిపించాయి.

ఆస్ట్రేలియా బౌలింగులో మిచెల్ స్టార్క్ 2, నాథన్ ఎలిస్ 2, మార్కస్ స్టోనిస్ 3, ఆడమ్ జంపా 2 వికెట్లు పడగొట్టారు.

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేశాడు. 51 బంతుల్లో 1 సిక్స్, 6 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. ఇదే వార్నర్ ఐపీఎల్ మ్యాచ్ ల్లో కంప్లీట్ ఫెయిల్ అవడం విశేషం. మరో విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ (12) త్వరగా అవుట్ అయిపోయాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ (14), ఎప్పటిలా మ్యాక్స్ వెల్ గోల్డెన్ డక్ అవుట్ అయ్యారు.

అనంతరం వచ్చిన మార్కస్ స్టోనిస్ అద్భుతంగా ఆడాడు. 36 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 67 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చివర్లో టిమ్ డేవిడ్ (9) రన్ అవుట్ అయ్యాడు. మొత్తానికి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఒక మోస్తరు స్కోరుతో బయటపడింది.

ఒమన్ బౌలింగులో బిలాల్ ఖాన్ 1, కలీముల్లా 1, మెహ్రాన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×