పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య రెండు టెస్టులు, మూడు టి20 లు, చివరగా మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ మొత్తం పాకిస్తాన్ దేశంలోనే జరుగుతోంది. ఇప్పటికే మొదటి టెస్టులో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ విజయం సాధించింది. ప్రస్తుతం రెండో టెస్టు కొనసాగుతోంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ పూర్తయిన తర్వాత నవంబర్ 4వ తేదీ నుంచి 3 వన్డేల సిరీస్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నమెంట్ కు 15 రోజుల సమయం ఉండగానే కొత్త కెప్టెన్ ను ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.
మొన్నటి వరకు ఉన్న మహమ్మద్ రిజ్వాన్ ను తొలగించి అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదికి అవకాశం కల్పించింది. దీంతో 25 సంవత్సరాల షాహీన్ అఫ్రిది పాకిస్తాన్ వన్డే కెప్టెన్ గా కొనసాగాడు. షాహీన్ అఫ్రిదికు గతంలో పాకిస్తాన్ కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం ఉంది. 2024 సమయంలో న్యూజిలాండ్ తో జరిగిన టి20 సిరీస్ సందర్భంగా కెప్టెన్సీ ఇచ్చారు. ఆ సమయంలో సిరీస్ డ్రాగా ముగిసింది. అప్పుడు పాకిస్తాన్ జట్టును ముందుండి నడిపించాడు. దీంతో ఇప్పుడు మరోసారి వన్డే కెప్టెన్సీ షాహీన్ అఫ్రిదికి అందిస్తున్నారు.
2023 నవంబర్ నుంచి ఇప్పటి వరకు పదిమంది కెప్టెన్లను మార్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. 2023 నవంబర్ సమయంలో బాబర్ కెప్టెన్ గా ఉన్నాడు. అతన్ని రాజీనామా చేయించి టి20 కెప్టెన్ గా షాహీన్ అఫ్రిదికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అదే నెలలో షాన్ మషూద్ ను టెస్ట్ కెప్టెన్ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. మార్చి 2024 సమయంలో షాహీన్ అఫ్రిదిని టి20 నుంచి తొలగించారు. ఆ తర్వాత బాబర్ ఆజాంకు అవకాశం ఇచ్చారు. మళ్లీ బాబర్ చేత రాజీనామా చేయించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అది అక్టోబర్ 2024 సమయంలో జరిగింది. అదే నెలలో రిజ్వాన్ కు వైట్ బాల్ కెప్టెన్సీ ఇచ్చారు. మార్చి 2025 సమయంలో సల్మాన్ అలీ అఘాను టి20 కెప్టెన్ చేశారు. ఇక ఈ నెలలో రిజ్వాన్ చేత రాజీనామా చేయించి షాహీన్ అఫ్రిదికి వన్డే కెప్టెన్సీ ఇస్తున్నారు.
Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే పనులు ?
Musical Chair of Pakistan Captaincy.
Nov 2023 – Babar Azam resigned as captain.
Nov 2023 – Shaheen Afridi appointed T20I captain.
Nov 2023 – Shan Masood appointed Test captain.
Mar 2024 – Shaheen removed from captaincy.
Mar 2024 – Babar reappointed T20I captain.
Oct 2024 – Babar… pic.twitter.com/iCusN1WiAO— Sheri. (@CallMeSheri1_) October 20, 2025