Aussie players on RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి… ఏడున్నర గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త టెన్షన్ మొదలైంది. అది కూడా ఆస్ట్రేలియా ప్లేయర్ల కారణంగా… టైటిల్ కోల్పోతామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఆస్ట్రేలియా ప్లేయర్లు అండ్రు సైమాండ్, మైక్ హసి అలాగే బెన్ కటింగ్ గతంలో ఫైనల్స్ లో ఇతర జట్లలో ఆడి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించి ఇంటికి పంపించారు.
Also Read: Shreyas Iyer : మీరు నా ముందు పిల్ల బచ్చాలు… ముంబైని అవమానించిన అయ్యర్.. చూయింగ్ గమ్ ఉమ్మేస్తూ
బెంగళూరుకు పీడకల మిగిల్చిన ఆండ్రు సైమండ్స్
2009 సంవత్సరంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ డెక్కన్ చార్జెస్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు పై విజయం సాధించిన డెక్కన్ చార్జెస్ … ఛాంపియన్గా నిలిచింది. ఆ సమయంలో ఆరు వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించి విజయం సాధించింది డెక్కన్ చార్జెస్. అయితే డెక్కన్ చార్జెస్ టీం లో ఆండ్రూ సైమండ్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రు సైమండ్స్ కారణంగా అప్పుడు డెక్కన్ చార్జెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది.
బెంగళూరు నుంచి చేసిన మైక్ హస్సి
2011 సంవత్సరంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మైక్ హాసి కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. అతను కూడా ఆస్ట్రేలియా ప్లేయర్ అన్న సంగతి తెలిసిందే. అతని కారణంగానే బెంగళూరు ఇంటిదారి పట్టింది. టైటిల్ గెలవలేకపోయింది.
బెంగళూరుకు చుక్కలు చూపించిన బెన్ కటింగ్
ఇక ఆస్ట్రేలియాకు చెందిన మరో ఆటగాడు బెన్ కటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2016 సంవత్సరంలో ఫైనల్ మ్యాచ్ సన్ రైజర్స్ వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన బెన్ కటింగ్… మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. అతని దెబ్బకు బెంగళూరు ఆశలు.. మొత్తం ఆవిరి అయిపోయాయి. అయితే ఈ ముగ్గురు గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఫైనల్ లో ఇంటికి పంపించారని… ఇప్పుడు పంజాబ్ కింగ్స్ లో ఉన్న మార్కస్ స్టోయినిస్ కూడా బెంగళూరు ను ఓడిస్తాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బెంగళూరు అభిమానులు భయపడిపోతున్నారు.