Film Industry: సినీ ఇండస్ట్రీలో ఒక వార్త తెగ వైరల్ గా మారుతోంది. అదేంటంటే మీకు స్టార్ స్టేటస్ కావాలా? అయితే ఈ డైరెక్టర్ చేతిలో చెంప దెబ్బ తినండి.. ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోతారు అంటూ.. అయితే ఈ మాట వెనుక అర్థం నిజంగానే ఉందని చెప్పాలి. అంతేకాదు ఆ స్టార్ డైరెక్టర్ చేతిలో ప్రత్యక్షంగా చెంప దెబ్బలు తిన్న ఎంతోమంది హీరోయిన్లు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడమే కాకుండా లక్షలాదిమంది అభిమానుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. మరి ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? ఆయన చేతిలో చెంప దెబ్బలు తిని స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరు? అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
డైరెక్టర్ చేతిలో చెంప దెబ్బలు తిని స్టార్స్ అయిన హీరోయిన్స్!
ఆయన ఎవరో కాదు ప్రముఖ స్టార్ డైరెక్టర్ భారతీ రాజా (Bharathiraja).. కోలీవుడ్లో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన ఎంతోమంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా పరిచయం చేసిన హీరోయిన్ల మీద ఆయన చేయి కూడా చేసుకున్నారు. ముఖ్యంగా సీతాకోకచిలుక, 16 వయదినలే, కాదల్ పుక్కల్, అంతిమంతరై ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. గ్రామీణ నేపథ్యంతో కూడిన సినిమాలు తీయడంలో భారతీరాజా దిట్ట. అంతేకాదు తన సినిమాల ద్వారా కొత్తవారిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇకపోతే భారతీ రాజా ఇండస్ట్రీకి పరిచయం చేసిన వారిలో రేవతి (Revathi), రేఖ(Rekha ), రాధా(Radha ), రాధిక (Radhika) వంటి హీరోయిన్లు ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఏంటంటే.. ఈయన ఎవరినైతే ఇండస్ట్రీకి పరిచయం చేస్తారో వారికి ఆర్ (R) అనే అక్షరంతో పేరు పెట్టే అలవాటు కూడా ఉంది. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే.. భారతీరాజా దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ ప్రియమణి (Priyamani) పేరు మాత్రం ఆయన మార్చలేదు. ఈయన దర్శకత్వం వహించిన ‘కంగలాల్ ఖైదు సై’ అనే సినిమాతోనే ప్రియమణి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇదిలా ఉండగా ఈయన దర్శకత్వంలోనే ఇండస్ట్రీకి పరిచయమై.. ఈయన చేతిలో చెంప దెబ్బలు తిని స్టార్ హీరోయిన్స్ అయిన వారు కూడా ఉన్నారు. మరి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
రాధా, రాధికే కాదు శ్రీదేవి కూడా..
వాస్తవానికి ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా దర్శకుడు చెంప దెబ్బ కొట్టాల్సిన పనిలేదు. ఒక్క మాట అంటే చాలు అది ఎంత రచ్చ అవుతుందో అందరికీ తెలుసు. కానీ ఆ రోజుల్లో డైరెక్టర్ కొడతారని కొంతమంది హీరోయిన్స్ ఓపెన్ గా చెప్పేవారు. అలా దెబ్బతిన్న హీరోయిన్లలో రాధిక కూడా ఒకరు. ఈమె భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ‘కిజక్కే పోగుమ్ రైల్’ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం చేశారు. ఈ సినిమా ఈమె జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇకపోతే ఈ సినిమా మొత్తం ఈమె ఏడుస్తూనే నటించాలి. అయితే ఎవరికైనా ఎంతసేపు కన్నీళ్లు వస్తాయి.. అలా ఈ సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడింది. ముఖ్యంగా ఒక షాట్ లో ఎంత గ్లిజరిన్ వాడినా ఏడుపు రాకపోయేసరికి గట్టిగా కోపంతో ఆమె చెంప పగలగొట్టారట . వెంటనే రాధిక కళ్ళ నుంచి కన్నీరు ధారాళంగా కారాయట. ఇక ఈమె మాత్రమే కాదు రేవతి, ప్రియమణి, రేఖ, రాధిక, శ్రీదేవి (Sridevi ) వంటి హీరోయిన్లందరూ కూడా భారతీరాజా డైరెక్షన్లో దెబ్బలు తిని అప్పట్లో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న వారే. ఇకపోతే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ:Rana Naidu 2 Trailer : రానా నాయుడు 2 ట్రైలర్ అవుట్… మొత్తానికి అది మార్చేశారు