Suryakumar Yadav: టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ( SURYAKUMAR YADAV) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెప్టెన్సీ కోల్పోతానని భయం తనలో ఉందని, అది కూడా శుభ్‌మన్ గిల్ ( Shubman Gill) వల్ల అంటూ హాట్ కామెంట్స్ చేశాడు సూర్య కుమార్ యాదవ్. తాజాగా టీమిండియా టి20 కెప్టెన్సీ పై తాజాగా సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. టి20 లకు గిల్ ను కెప్టెన్ చేస్తారన్న ఊహాగానాలపై ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నేను అబద్ధం చెప్పను.. కెప్టెన్సీ విషయంలో మాత్రం చాలా భయంగా ఉంది.. గిల్ ను ఎప్పుడు కెప్టెన్ చేస్తారో ? అనే టెన్షన్ లో నేను ఉన్నానని సూర్య కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
శుభ్‌మన్ గిల్ కారణంగా కెప్టెన్సీ పోతుందని కాస్త టెన్షన్ అయితే ఉంది.. ఆ విషయంలో రోజు కూడా టెన్షన్ పడతా అంటూ సూర్య కుమార్ యాదవ్ వెల్లడించారు. భయమే తనకు మోటివేషన్ అండు కీలక వ్యాఖ్యలు చేశారు. హార్డ్ వర్క్ చేస్తూ నిజాయితీగా ఉంటే మిగతావన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. టెస్టు, వన్డే లకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్ అవడం వల్ల హ్యాపీగా ఉండాలని తెలిపారు. శుభ్‌మన్ గిల్ తో ఈ మధ్య మంచి ఫ్రెండ్షిప్ పెరిగిందని పేర్కొన్నారు సూర్య కుమార్ యాదవ్. తాను వన్డేలలో బాగా రాణించి ఉంటే, నాకు వన్డే కెప్టెన్సీ కూడా లభించేందని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో నేను ఇప్పటికీ ప్రయత్నం చేస్తానని తెలిపారు. వన్డే క్రికెట్ ఆడటం తనకు ఇప్పటికీ కూడా కల అంటూ పేర్కొన్నారు. నేను నా భార్యతో ఇదే విషయంపై చర్చించేవాడిని అంటూ తెలిపారు. రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఉన్నప్పుడే ఈ ఆలోచన వచ్చిందని వివరించాడు.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Team India vs Australia ) మధ్య రేపటి నుంచి వన్డే అలాగే టీ20 సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మూడు వన్డేలు అలాగే ఐదు టి20 లు ఈ రెండు జట్ల మధ్య జరగనున్నాయి. వన్డే లకు గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. సూర్య కుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) మాత్రం టి20 లకు కెప్టెన్ గా ఉంటాడు. అక్టోబర్ 29వ తేదీ నుంచి టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టి20 సిరీస్ ప్రారంభం అవుతుంది. ఇందులో భాగంగానే మొత్తం ఐదు టి20లో ఆడతారు. మొదటి టీ20 మనుకా ఓవల్ వేదికగా జరగనుండగా, చివరిది గబ్బా వేదికగా నిర్వహించనున్నారు.