Ind vs Aus, 3rd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో ( Border-Gavaskar Trophy 2024/25) భాగంగా ఇవాళ ఇండియా ( Team india ) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య మూడో టెస్ట్ ప్రారంభమైంది. ఉదయం ఐదు గంటల 50 నిమిషాలకు.. ఈ మ్యాచ్ ప్రారంభం కావడం జరిగింది. వాస్తవంగా… మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లు కాస్త ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కానీ ఈ మూడో టెస్టు నుంచి ఉదయం 5 గంటల తర్వాతనే మ్యాచులు ప్రారంభం అవుతాయి.
Also Read: World Chess Champion Gukesh: గుకేష్ తెలుగోడు కాదు…చంద్రబాబు వర్సెస్ స్టాలిన్ ?
అక్కడ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో… భారత కాలమానం ప్రకారం ఐదు గంటల 50 నిమిషాలకు గబ్బా టెస్ట్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్లో మొదట టాస్ నెగ్గిన టీమిండియా ( team india) బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లలో బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా.. ఈసారి మాత్రం బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్కు దిగడం జరిగింది. ఇవాల్టి నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఈ ఐదవ టెస్ట్ ప్రారంభం అవుతుంది.
అయితే… ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియాలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. హర్షిత్ రానా ను… అందరూ అనుకున్నట్లుగానే తుది జట్టు నుంచి తొలగించారు. హర్షిత్ రానా స్థానంలో ఆకాష్ జట్టులోకి వచ్చాడు. అటునితీష్ కుమార్ రెడ్డి ని కూడా తొలగిస్తానని వార్తలు వచ్చాయి. కానీ అతడు తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.
Also Read: Vinod Kambli: పెన్షన్ డబ్బులతో బతుకీడుస్తున్న భారత మాజీ క్రికెటర్!
అయితే ఈ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి వాతావరణము ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆస్ట్రేలియా… బ్యాటింగ్ చేస్తున్న సమయంలో… వర్షం కూడా పడింది. దీంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది కూడా..! దాదాపు పది నిమిషాలు మ్యాచ్ ఆగిపోయిన తర్వాత మళ్లీ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తోంది. 7 ఓవర్లు పూర్తిగా కాగా వికెట్లు ఏమి నష్టపోకుండా 24 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.
కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో ( Border- Gavaskar Trophy 2024/25) భాగంగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఇందులో మొదటి మ్యాచ్ లో టీమిండియా సాధించింది. అటు ఆస్ట్రేలియా రెండో టెస్టులో విజయం సాధించింది.
ఇరు జట్లు:
ఆస్ట్రేలియా ( ( Australia ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(c), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్
భారత్ ( Team india ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (w), రోహిత్ శర్మ(c), రవీంద్ర జడేజా, నితీష్ కుమా ర్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్