BigTV English

Brahmamudi Serial Today December 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: దివాలా తీసిన స్వరాజ్‌ కంపెనీ – రోడ్డు మీదకు వచ్చిన రాజ్‌ బతుకు   

Brahmamudi Serial Today December 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: దివాలా తీసిన స్వరాజ్‌ కంపెనీ – రోడ్డు మీదకు వచ్చిన రాజ్‌ బతుకు   

Brahmamudi serial today Episode:  రుద్రాణి, ధాన్యలక్ష్మీ తమ మాటలతో కనకాన్ని వెటకారంగా తిట్టడంతో వాళ్ల మాటలకు బాధపడొద్దని.. మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఓదారుస్తున్న నిన్ను వీళ్లు అవమానించినందుకు మమ్మల్ని క్షమించు కనకం అంటుంది ఇందిరాదేవి. ఎవరో అనుకున్న మీరు మా కష్టాలకు చలించిపోతున్నారు. మా వాళ్లు అనుకున్న వీళ్లు పరాయివాళ్లలా ప్రవర్తిస్తూ..మానవత్వం మర్చిపోయారు అంటూ ఏడుస్తుంది ఇందిరాదేవి. అందరూ ఇందిరాదేవిని ఓదారుస్తారు.


రాజ్‌ ఆఫీసులో జగదీష్‌ గారి కాంట్రాక్ట్‌ కంప్లీట్ కాగానే మేనేజర్‌ ఆయన దగ్గరకు వెళ్లి చెక్‌ కలెక్ట్‌ చేసుకోమని చెప్పు. ఆయన మా తాతగారి ఫ్రెండ్‌. ఆయన్ని ఆఫీసుకు పిలిపించవద్దు అని చెప్తుంటాడు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు రాజ్‌ చాంబర్‌లోకి వస్తారు. ఏయ్‌ ఎవరు మీరు లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్‌ తీసుకుని రావాలని తెలియదా..? అంటాడు. సార్‌ మేము బాంకు నుంచి వస్తున్నాము.. రాజ్‌ అంటే మీరేనా..? అని అడుగుతారు. మీ తాతయ్యగారు మా బ్యాంకులో వంద కోట్లకు ష్యూరిటీ పెట్టారు అని చెప్పగానే రాజ్‌ షాక్‌ అవుతాడు.

ఎవరో అనుకుని ఎవరి దగ్గరకు వచ్చారో తెలుసుకుని మాట్లాడండి అని రాజ్‌ కోప్పడతాడు. సీతారామయ్య అంటే మీ తాతయ్యే కదా..? అని అడగ్గానే అవునని రాజ్‌ చెప్తాడు. అయితే ఎంబీ కంపెనీ కి స్టార్ట్‌ చేసినప్పుడు మీ తాతగారు వంద కోట్లకు ష్యూరిటీ ఉన్నారు. ఇప్పుడు వంద కోట్లు కడతారా..? లేకపోతే మీ ఆస్థులు జప్తు చేయమంటారా..? అని అడగ్గానే రాజ్‌ షాక్‌ అవుతాడు.  తాము తీసుకొచ్చిన పేపర్స్‌ మీద సంతకం చేయమని అలా చేస్తే మీర డబ్బులు కట్టడానికి పది రోజుల టైం ఇస్తామని.. లేదంటే ఇప్పుడే మీ ఆస్థులు జప్తు చేస్తామని చెప్తారు. ఇంతలో రాజ్‌ పీఏ రాజ్‌ను పక్కకు తీసుకెళ్లి సార్‌ ఇప్పుడు ఆస్తి మొత్తం మీ తాతయ్యగారి పేరు మీద లేదు కదా.? అంతా కావ్య మేడం పేరు మీద ఉంది కాబట్టి సంతకం చేయనని.. అసలు దానికి మీకు సంబంధమే లేదని చెప్పండి అని సలహా ఇవ్వగానే…


మరి మా తాతయ్యగారు ఇచ్చిన మాట అంటే ఆయనే ఇప్పుడు కోమాలో ఉన్నారు. ఇంకా మీరు ఆయన మాట గురించి ఆలోచిస్తున్నారా..? అనగానే రాజ్‌ కోపంగా పీఏ కాలర్‌ పట్టుకుని తిడతాడు. ఆస్థి కోసం మా తాతయ్య మాటలను గాలికొదిలేస్తాను అనుకున్నావా..? ఏం చేసైనా సరే మా తాతయ్య పరువు పోకూడదు అంటూ బయటకు వచ్చి రాజ్‌ పేపర్స్‌ మీద సైన్‌ చేస్తాడు. సార్‌ మనవడు అంటే ఆస్థులనే కాదు తాతయ్యగారి విలువను కూడా కాపాడతారని ప్రూవ్‌ చేశారు. అంటూ వెళ్లిపోతారు. మీరు చాలా గ్రేట్‌ సార్‌. అప్పు తీసుకున్న వాళ్లు ఈరోజుల్లో ఎలా ఎగ్గొట్టాలా అని ఆలోచిస్తుంటారు. కానీ మీరు మీ తాతయ్య కోసం చాలా పెద్ద రిస్క్‌ తీసుకున్నారు అంటూ మెచ్చుకుని వెళ్లిపోతాడు. సంతకం అయితే పెట్టాను కానీ అంత డబ్బు ఎలా తీసుకురావాలి అనుకుంటాడు.

సుభాష్‌ లాప్‌టాప్ లో ఏదో వర్క్‌ చేసుకుంటుంటే రుద్రాణి వచ్చి డబ్బులు అడుగుతుంది. ఇప్పుడు నేను ఇంటి పెద్దనే కానీ డబ్బులు ఇచ్చే అధికారం నాకు లేదు అని చెప్తాడు. ఆ అధికారం కావ్యకే ఉందని చెప్తాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇంతలో రాహుల్‌ వచ్చి నేను చెప్తాను మీరు వెళ్లండి మామయ్య అంటూ రాహుల్‌ చెప్పగానే సుభాష్‌ వెళ్లిపోతాడు. ఏంట్రా నువ్వు నాకు చెప్తావా..? అంటూ రుద్రాణి కోపంగా రాహుల్‌ను తిడుతుంది. ఆవేశం అనర్థాలకు దారి తీస్తుంది. వచ్చే డబ్బులు కూడా రాకుండా చేస్తుంది అంటాడు. అందుకని చేతులు కట్టుకుని ఆ గుమ్మడి కాయ ముఖం దాని ముందు నిలబడి డబ్బులు కావాలి అని అడగమంటావా అంటుంది.

అలా ఎలా నిన్ను అడగనిస్తాను మామ్‌. అంటూ తన ప్లాన్‌ చెప్తాడు రాహుల్‌. అరేయ్‌ రాహుల్‌ బుద్ది పెరగడం కోసం నాకు తెలియకుండా ఏమైనా మందులు వాడుతున్నావా..? అంటూ మెచ్చుకుంటుంది. గార్డెన్‌లో వాటర్‌ పడుతున్న కావ్య దగ్గరకు రుద్రాణి వెళ్తుంది. నాకు రెండు లక్షలు కావాలని అడుగుతుంది. దీంతో ఈవిడ నిజంగా అవసరం ఉండి అడుగుతుందా..? లేక అవసరం సృష్టించుకుని అడుగుతుందా..? అని మనసులో అనుకుంటుంది కావ్య. ఏంటి ఆలోచిస్తున్నావు వెళ్లి డబ్బులు తెచ్చి ఇవ్వు అని చెప్తుంది. అంత డబ్బు నీకెందుకు అని ఆలోచిస్తున్నాను అని కావ్య చెప్పగానే ధాన్యలక్ష్మీ వచ్చి కావ్యను తిడుతుంది.

దీంతో కావ్య లోపలికి వెళ్లి  డబ్బులు తీసుకువచ్చి ఇస్తుంది. ఇక నుంచి నేను ఎంత అడిగితే అంత నోరు మూసుకుని ఇవ్వాలి అని చెప్పి రుద్రాణి డబ్బులు తీసుకుని వెళ్లిపోతుంది. మరోవైపు వంద కోట్ల గురించి రాజ్ ఆలోచిస్తుంటాడు. ఇంతలో శృతి వచ్చి ఫైల్స్‌ మీద సంతకం పెట్టమని అడిగితే తిట్టి పంపించేస్తాడు. తర్వాత రాజ్‌ బయటకు వెళ్లి ఒక్కడే నడుచుకుంటూ వెళ్లిపోతుంటాడు. వెనకాలే డ్రైవర కారుతో వస్తూ ఎంత పిలిచినా పలకకుండా అలాగే వెళ్లిపోతుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం పై నర్మదకు అనుమానం.. శ్రీవల్లి దొరికినట్లేనా? చందు పై రామరాజు సీరియస్..

Intinti Ramayanam Today Episode: పల్లవి చెంప పగలగొట్టిన అవని.. తమ్ముడి కోసం అవని షాకింగ్ నిర్ణయం..

Brahmamudi Serial Today August 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను ఫాలో చేసిన రాజ్‌ – క్యాన్సర్‌ డాక్టర్‌ దగ్గరకు వెళ్లిన కావ్య

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు దిమ్మతిరిగే షాక్.. కల్పన దెబ్బకు ఫ్యూజులు అవుట్… రోహిణికి మైండ్ బ్లాక్..

Nindu Noorella Saavasam Serial Today August 11th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు షాక్‌ ఇచ్చిన మిస్సమ్మ

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Big Stories

×