Asia Cup 2025 : ఆసియా కప్ 2025 ప్రారంభమై ఇప్పటికే టీమిండియా యూఏఈతో తొలి మ్యాచ్ లో తలపడ్డ విషయం తెలిసిందే. ఇవాళ పాకిస్తాన్ జట్టు కూడా ఒమన్ తో తలపడుతోంది. అయితే భారత్-పాక్ మ్యాచ్ కి ఉన్నంత మ్యాచ్ కి ఉన్నంత టెన్షన్ వాతావరణం ప్రపంచంలో మరే జట్ల మ్యాచ్ కి ఉండదేమో. గతంలో పాకిస్తాన్-ఇండియా మ్యాచ్ జరుగుతుందంటే ఉత్కంఠ వాతావరణం ఉండేది. కానీ ప్రస్తుతం అలాంటి వాతావరణం ఏమి ఉండకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో పాకిస్తాన్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ 6 బంతుల్లో 6 సిక్స్ లు కొడతాడని పేర్కొనడం గమనార్హం.
Also Read : IND Vs PAK : ఆదివారం మీకు చుక్కలు చూపించడం పక్కా.. కమ్రాన్ అక్పల్ సంచలనం
అతను ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తన్వీర్ కి టీమిండియా అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ లో అయూబ్ కనీసం ఫోర్ అయినా కొడతాడా..? మరికొందరూ అయితే బాల్ ని అయినా టచ్ చేస్తాడా..? ఇంకొందరూ అయితే బుమ్రా యార్కర్ కి డకౌట్ అవుతాడని సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తం ప్రపంచ క్రికెట్ లో జస్ప్రీత్ బుమ్రా నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రపంచ బ్యాటర్లు స్మిత్, రూట్, స్టోక్స్ వంటి ఆటగాళ్లు సైతం బుమ్రా బౌలింగ్ లో పరుగులు కొట్టడానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. లూజ్ బాల్ వచ్చినప్పుడు తప్ప మిగతా బంతుల్లో అంతగా పరుగులు చేయలేరు. అలాంటి 6 బంతుల్లో 6 సిక్స్ లు అంటే అంటే అది కలలో కూడా జరగదనే చెప్పాలి. పాకిస్తాన్ టీమ్ లో అయూబ్ గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు.
ముఖ్యంగా అయూబ్ 41 టీ-20 మ్యాచ్ ల్లో 816 పరుగులు చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా అద్భుతంగా చేస్తాడు అయూబ్. దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్ లో యూఏఈ ని 9 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఇప్పుడు అదే మైదానంలో పాక్ ఒమన్ తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. పసికూన ఒమన్ ని చిత్తు చేసి టోర్నీలో శుభారంభం చేయాలని పాకిస్తాన్ కూడా భావిస్తోంది. ఇండియాతో పాటు పాకిస్తాన్ కూడా అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతుంది. యూఏఈతో జరిగిన ట్రై సిరీస్ విజయంతో ఈ టోర్నీలో అడుగుపెట్టింది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ లు లేకపోయినప్పటికీ చాలా మంది యంగ్ టాలెంటేడ్ ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా ముగ్గురు ఆల్ రౌండర్లు, ఇద్దరూ ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్ బౌలర్లతో బరిలోకి దిగనున్నట్టు సమాచారం. షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను టీమిండియా ఆటగాళ్లు ఏవిధంగా ఎదుర్కొంటారో వేచి చూడాలి మరీ.