Nepal: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి(72) ఎంపికయ్యారు. జెన్ జెడ్ నిరసనకారులు సుశీల కర్కి పేరును ప్రధానిగా ప్రతిపాదించారు. జెన్ జెడ్, ఆర్మీ, అధ్యక్షుడి మధ్య కుదిరిన ఏకాభిప్రాయం దేశాధ్యక్షుడు నేపాల్ పార్లమెంట్ ను రద్దు చేశారు. కాసేపట్లో ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుశీల కర్కి గతంలో నేపాల్ ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.
సుశీల కర్కి ఎవరంటే..?
సుశీల కర్కీకి నేపాల్ దేశ చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉంది. తొలుత టీచర్ కెరీర్ ను ప్రారంభించిన ఆమె న్యాయ వృత్తిని ఎంచుకున్నారు. 2009లో సుప్రీంకో్ర్టులు అడుగుపెట్టారు. ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టారు. నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన రికార్డ్ సృష్టించారు. జెన్ జెడ్ ఉద్యమంలో సుశీల కర్కి కీలక పాత్ర పోషించారు.