E-Paper
Advertisement

బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసి నాకు రాహుల్ ద్రవిడ్ సాయం చేశాడు..పాక్ క్రికెట‌ర్ సంచ‌ల‌నం!

బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసి నాకు రాహుల్ ద్రవిడ్ సాయం చేశాడు..పాక్ క్రికెట‌ర్ సంచ‌ల‌నం!
Advertisement

Azhar Ali On Rahul Dravid:  టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పై (Rahul Dravid) పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అజ‌హ‌ర్ అలీ (Azhar Ali) ప్రశంసల వర్షం కురిపించాడు. తన కెరీర్ గడ్డు కాలంలో ఉన్నప్పుడు రాహుల్ ద్రావిడ్ ఎంతో సహాయం చేశాడని.. బీసీసీఐ రూల్స్ కూడా పట్టించుకోకుండా తన కోసం కృషి చేశాడని మెచ్చుకున్నాడు. ఆ గొప్ప వ్యక్తి కారణంగానే తాను ఓ అద్భుతమైన క్రికెటర్ గా ఎదిగానని గుర్తు చేశాడు. శత్రుదేశం అయినప్పటికీ.. తనకు సహాయం చేయాలన్న గొప్ప హృదయం రాహుల్ ద్రవిడ్ కు ఉందని.. అతనికి జన్మ జన్మల రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. దీంతో రాహుల్ ద్రవిడ్ పై అజహ‌ర్ అలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

రాహుల్ ద్రవిడ్ ను అజహర్ అలీ ఎందుకు మెచ్చుకున్నాడు అంటే ?

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అజాహర్ అలీ… జట్టుతో కలిసి న్యూజిలాండ్ పర్యటనకు గతంలో వెళ్ళాడు. ఈ క్రమంలో అదే విమానంలో టీమిండియా అండర్ 19 జట్టు కూడా న్యూజిలాండ్ ప‌య‌న‌మైంది. ఆ స‌మ‌యంలో అండర్ 19 టీమిండియా కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ విమానంలోనే ఉన్నాడు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అజాహర్ అలీ…టెస్టుల్లో మెరుగ్గా రాణించ‌డంపై స‌ల‌హాలు అడ‌గాల‌ని అనుకున్నాడు. కానీ ఇండియ‌న్స్ త‌న‌కు సాయం చేస్తారో? లేదో? అని సందేహా ప‌డ్డాడు. కానీ ధైర్యం చేసి ద్ర‌విడ్ వ‌ద్ద‌కు వెళ్లాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అజాహర్ అలీ.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

ఇక ఆలస్యం చేయకుండా టెస్ట్ క్రికెట్ లో బ్యాటింగ్ మెరుగు పరుచుకునేందుకు సలహాలు ఇవ్వండి అని రాహుల్ ద్రవిడ్ ను పాక్ క్రికెట‌ర్ అజహర్‌ అలీ (Azhar Ali) వేడుకున్నాడు. దీంతో పాకిస్తాన్ వాడని చూడకుండా వెంటనే రాహుల్ ద్రవిడ్.. అతన్ని పక్కన కూర్చో పెట్టుకొని సలహా, సూచనలు ఇచ్చాడు. అప్పటికే అజహర్ అలీ బ్యాటింగ్ బలహీనతలు అర్థం చేసుకున్న రాహుల్ ద్రవిడ్.. కొన్ని మెలుకువలు నేర్పించాడు.

Advertisement

ఇక వాటిని పాటించిన అజ‌హార్ అలీ… ఆ తర్వాత సిరీస్ నుంచి అదరగొట్టాడు. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అజ‌హార్ అలీ వెల్లడించడం గమనార్హం. కాగా, పాక్ క్రికెట‌ర్ అజహర్‌ అలీ (Azhar Ali) తన 12 సంవత్సరాల టెస్ట్ కెరీర్ లో మొత్తం 97 మ్యాచులు వాడాడు. ఇందులో 42.26 యావరేజ్ సాధించిన అజహార్ అలీ…. 7142 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్ పై 2016లో ట్రిపుల్ సెంచరీ కూడా చేశాడు. తన 12 సంవత్సరాల కెరీర్ లో 35 అర్థ సెంచరీలు చేసిన అజహార్ అలీ 19 సెంచరీలు నమోదు చేశాడు.

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

ట్రావిస్ హెడ్ భార్య‌పై మ‌ళ్లీ విమ‌ర్శ‌లు…క‌నిపిస్తే రే**ప్ చేస్తామంటూ పోస్టులు!

న్యూజిలాండ్ కొంప‌ముంచిన అంపైర్ ధర్మసేన.. కేఎల్ రాహుల్ కు రెండు లైఫ్ లు

100 జన్మలు ఎత్తినా ఐపీఎల్‌ను PSL దాటలేదు.. క్వెట్టా గ్లాడియేటర్స్ ఓనర్ నదీమ్ సంచలనం

బుమ్రా తప్ప అందరూ డమ్మీలే…సిరాజ్ ఆడింటే తొలి రోజే న్యూజిలాండ్ కుప్పకూలేది

టీమిండియా ట్రోలింగ్ తట్టుకుని నిలబడ్డ హంజాకు రూ.20 లక్షల నజరానా ప్రకటించిన షాహిద్ అఫ్రిది

న‌వంబ‌ర్ 22న మేం కొట్టే దెబ్బ‌కు ఖ‌తార్ నుంచి టీమిండియా పారిపోతుంది

పెషావ‌ర్ జ‌ల్మీలో అంద‌రూ దొంగ‌లే…బాల్ టాంప‌రింగ్ చేసి PSL 2026 టైటిల్ గెలిచారు

Big Stories

Advertisement
×