E-Paper
Advertisement

టీమిండియా ట్రోలింగ్ తట్టుకుని నిలబడ్డ హంజాకు రూ.20 లక్షల నజరానా ప్రకటించిన షాహిద్ అఫ్రిది

టీమిండియా ట్రోలింగ్ తట్టుకుని నిలబడ్డ హంజాకు రూ.20 లక్షల నజరానా ప్రకటించిన షాహిద్ అఫ్రిది
Advertisement

Shahid Afridi On Yashveer Goud Aggressive Celebrations:  అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Under-19 Asia Cup 2026 tournament) విజేతగా టీమిండియా జూనియర్స్ నిలిచారు. గత శనివారం జరిగిన ఫైనల్ పోరులో ఒకే ఒక వికెట్ తో తేడాతో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసిన టీమిండియా, 9వ సారి చాంపియన్ గా నిలిచింది. ఈ సందర్భంగా టీమిండియా ప్లేయర్లు అగ్రెసివ్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీంతో టీమిండియా ఆటగాళ్లపై పాకిస్తాన్ మాజీలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు.

హంజాకు రూ.20 లక్షల నజరానా ప్రకటించిన షాహిద్ అఫ్రిది

ఇప్పటికే తన్వీర్ అహ్మద్, షోయబ్ అక్తర్ లాంటి మాజీలు ఇప్పటికే ఈ సంఘటనను ఖండించగా, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) సంచలన ప్రకటన చేశాడు. ఒమన్ వేదికపై టీమిండియా కుర్రాళ్లు గట్టిగా అరుస్తూ, ట్రోలింగ్ చేసినా… హంజా జహూర్ ధైర్యంగా అక్కడే నిలబడ్డాడని మెచ్చుకున్నాడు. టీమిండియాకు ప్లేయర్లను దీటుగా ఎదుర్కొన్న హంజా జహూర్ కు రూ.20 లక్షలు (PKR) ప్రకటిస్తున్నాని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ఇంటికి వెళ్లి మరీ, ఈ చెక్ ఇస్తానని వెల్లడించాడు. అతనికి దగ్గరుండి ట్రైనింగ్ ఇస్తానని, వైభవ్ సూర్యవంశీ కంటే బలమైన ప్లేయర్ గా తయారు చేస్తానని ప్రకటించాడు. దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

పాకిస్తాన్ ప్లేయర్లను రెచ్చగొట్టిన టీమిండియా ఆటగాళ్లపై బ్యాన్ వేయాల్సిందే

అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Under-19 Asia Cup 2026 tournament)  సందర్భంగా ఫైనల్ గెలిచిన తర్వాత టీమిండియా కుర్రాళ్లు ఓవరాక్షన్ చేశారని షాహిద్ అఫ్రిది ఆగ్రహించాడు. క్రికెట్ లో గెలుపోటములు చాలా సహజమని తెలిపాడు. వికర్టీ సాధించిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకోవాలి, కానీ ఇంత దిగజారి ప్రవర్తించాలా ? అంటూ ప్రశ్నించాడు. క్రమ శిక్షణ లేకుండా టీమిండియా క్రికెటర్లు పెరుగుతున్నట్టున్నారని మండిపడ్డాడు. ఆ కుర్రాళ్లను తల్లిదండ్రులు సరిగ్గా పెంచాలని చురకలు అంటించాడు.

Advertisement

అగ్రెసివ్ సెలబ్రేషన్స్ చేసిన వాళ్లపై కచ్చితంగా ఐసీసీ విచారణ చేయాలని డిమాండ్ చేశాడు. తప్పు చేసిన వాళ్లపై బ్యాన్ కూడా విధించాలని కోరాడు. అప్పటి వరకు పాకిస్తాన్ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపాడు. ఇక రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో భాగంగా టీమిండియాను తమ పాకిస్తాన్ జట్టు కచ్చితంగా ఓడిస్తుందని హెచ్చరించాడు. దోహాలో ఓడించి, టీమిండియాపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశాడు. అప్పటి వరకు తాము నిద్రపోయేది లేదంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీంతో టీమిండియా ప్లేయర్లపై షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

 

Related News

న‌వంబ‌ర్ 22న మేం కొట్టే దెబ్బ‌కు ఖ‌తార్ నుంచి టీమిండియా పారిపోతుంది

పెషావ‌ర్ జ‌ల్మీలో అంద‌రూ దొంగ‌లే…బాల్ టాంప‌రింగ్ చేసి PSL 2026 టైటిల్ గెలిచారు

ఒరేయ్ జైస్వాల్ నీకు బుర్ర ఉందా? స్లెడ్జింగ్ చేయ‌బోయి, టీమిండియా ప‌రువు తీసావ్ క‌ద‌రా

దేశం కంటే మీకు TRP, డబ్బులెక్కువయ్యాయా? పాకిస్తాన్ మ్యాచ్ ల‌పై గంభీర్ సీరియ‌స్‌

అంబానీ కోడలిగా RCB కో-ఓన‌ర్ అనన్య బిర్లా? రెండుసార్లు రిజెక్ట్ చేసిందా?

ఫీల్డింగ్ చేస్తూ టీ తాగిన ఆకాశ్ దీప్…ప‌చ్చి బుతూలు తిట్టిన గిల్

DRSపై వివాదం..బ‌య‌ట‌ప‌డ్డ గ్లెన్ ఫిలిప్స్, అంపైర్ తో గిల్ గొడ‌వ‌

Big Stories

Advertisement
×