Quetta Gladiator owner Nadeem Omar On IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ చాలా చిన్నదంటూ పీఎస్ఎల్ కు ( PSL) చెందిన క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు ఓనర్ నదీమ్ ఒమర్ (Quetta Gladiator owner Nadeem Omar ) సంచలన వ్యాఖ్యలు చేశాడు. 100 జన్మలు ఎత్తినా ఐపీఎల్ ( IPL) టోర్నమెంట్ ను పాకిస్తాన్ సూపర్ లీగ్ బీట్ చేయలేదంటూ బాంబ్ పేల్చాడు. హమారీ వెబ్ పాడ్ కాస్ట్ లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు ఓనర్ నదీమ్ ఒమర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నదీమ్ ఒమర్.. ఐపీఎల్ టోర్నమెంట్ పై కీలక విషయాలు పంచుకున్నాడు. ఆర్థికంగా ఐపీఎల్ ను పీఎస్ఎల్ దాటడం కష్టమేనని తెలిపాడు.
ఐపీఎల్ కారణంగా కోట్లల్లో బీసీసీఐకి డబ్బులు వస్తున్నాయని తెలిపాడు. కానీ పాకిస్తాన్ మార్కెట్ చాలా చిన్నదని, అందుకే ఆర్థికంగా తాము ఐపీఎల్ లో పోటీ పడలేమని నదీమ్ వెల్లడించాడు. పీఎస్ఎల్ వల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దగా లాభాలు రావడం లేదంటూ వ్యాఖ్యానించాడు. కానీ ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్ జరిగితే వందల కోట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయని తెలిపాడు. స్పాన్సర్ ఫిప్ అవకాశాలు ఐపీఎల్ లో విపరీతంగా ఉంటాయని కామెంట్ చేశాడు. ఈ విషయాలు తెలిసినప్పటికీ, ఐపీఎల్ ను బీట్ చేస్తామని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు వెధవ వాగుడు వాగుతారంటూ క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు ఓనర్ నదీమ్ ఒమర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో నదీమ్ ఒమర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
క్వెట్టా గ్లాడియేటర్స్ ను అమ్మేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై కూడా ఆ జట్టు ఓనర్ నదీమ్ ఒమర్ ( Quetta Gladiator owner Nadeem Omar) క్లారిటీ ఇచ్చాడు. తాము జట్టును అమ్మడం లేదని, ఫేక్ వార్తలను నమ్మవద్దని కోరాడు. 3 బిలియన్ల పాకిస్తాన్ రూపాయలకు తమ జట్టును అమ్మేస్తున్నట్టు, ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిగినట్టు వచ్చిన వార్తలను ఖండించాడు. మంచి ధర వస్తే, విక్రయించడంపై ఆలోచన చేస్తామని మరో కామెంట్ చేశాడు. ఇది ఇలా ఉండగా, పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027, ఐపీఎల్ 2027 టోర్నమెంట్లు ఒకేసారి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 టోర్నమెంట్ మార్చి 18వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు కొనసాగనుంది. అటు ఐపీఎల్ 2027 టోర్నమెంట్ మార్చి 10వ తేదీ నుంచి మే 15 వరకు కొనసాగనుందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.