Tanveer Ahmed On Team India: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య గురువారం టెస్ట్ సిరీస్ ప్రారంభం అయింది. వెల్లింగ్టన్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ షురూ కాగా, మొదటి రోజు న్యూజిలాండ్ పై చేయి సాధించింది. టాస్ ఓడి మొదట బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు.. 100 లోపే 5 వికెట్లు పడగొట్టారు. కానీ ఆ తర్వాత న్యూజిలాండ్ పికప్ అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) సంచలన వ్యాఖ్యలు చేశాడు.
వరల్డ్ నెంబర్ వన్ జట్టు తమదేనంటూ విర్రవీగే టీమిండియా.. వెల్లింగ్టన్ లో టెస్టులో మూడు చెరువుల నీళ్లు తాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ దెబ్బకు టీమిండియా బౌలర్లు డీలా పడిపోయారంటూ బాంబ్ పేల్చాడు. టీమిండియాలో బుమ్రా తప్ప అందరూ డమ్మీలేనంటూ హేళన చేశాడు. చేతులోకి వచ్చిన మ్యాచ్ ను చేజార్చుకున్నారంటూ చురకలు అంటించాడు. తొలి టెస్టులో న్యూజిలాండ్ దెబ్బకు తోకమూడిచారంటూ సెటైర్లు పేల్చాడు. పాకిస్తాన్‌పై కాదు మగాళ్లయితే న్యూజిలాండ్‌ను ఓడించండి తన్వీర్ అహ్మద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజున బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ మెచ్చుకున్నాడు. మూడు కీలక వికెట్లు తీసి…న్యూజిలాండ్ నడ్డి విరిచాడని బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. అయితే, బుమ్రా ఇచ్చిన మంచి ఆరంభాన్ని మిగతా బౌలర్లు సద్వినియోగం చేసుకోలేదని, ధారళంగా పరుగులు ఇచ్చారని ఆగ్రహించాడు. పాకిస్తాన్ పై రెచ్చిపోయి ఆడే వీళ్లు, కివీస్ చేతిలో మాత్రం పసికూనలు అవుతున్నారని సెటైర్లు పేల్చాడు. బుమ్రా తప్ప.. టీమిండియా బౌలర్లు అందరూ డమ్మీగాళ్లేనని బాంబ్ పేల్చాడు.
మహ్మద్ సిరాజ్ ను తొలి టెస్టులో ఆడించకపోవడంపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. దీనిపై భారత మాజీలు కూడా రియాక్ట్ అవుతూ, గంభీర్ ను తిడుతున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ కూడా రియాక్ట్ అయ్యాడు. ముస్లిం క్రికెటర్లపై ముందు నుంచి చిన్న చూపేనని….అందుకే సిరాజ్ ను బీసీసీఐ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యాడు. సిరాజ్ తొలి టెస్ట్ ఆడింటే, మొదటి రోజే న్యూజిలాండ్ ఆలౌట్ అయ్యేదంటూ హాట్ కామెంట్స్ చేశాడు. సిరాజ్ ను కాదని దద్దమ్మలను ఆడించారని తన్వీర్ అహ్మద్ మండిపడ్డాడు.