BigTV English

Babar Azam Breaks Kohli’s Record: కొహ్లీ రికార్డుని దాటేసిన.. బాబర్ అజామ్

Babar Azam Breaks Kohli’s Record: కొహ్లీ రికార్డుని దాటేసిన.. బాబర్ అజామ్

Babar Azam Breaks Virat Kohli’s Record: టీ 20 ప్రపంచకప్ లో ఎన్నో రికార్డులు తెరమరుగు అవుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టీ 20లో అత్యధిక పరుగులు చేసి నెంబర్ వన్ గా నిలిచాడు. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్ లో 44 పరుగులు చేశాడు. దీంతో విరాట్ కొహ్లీ టాప్ స్కోరర్ గా ఉన్న 4038 పరుగులను అధిగమించాడు. ప్రస్తుతం తను 4067 పరుగులతో ముందంజలో ఉన్నాడు.


ప్రస్తుతం విరాట్ కొహ్లీ వయసు 35 ఏళ్లు. అదే బాబర్ అజామ్ వయసు 29 ఏళ్లే. ఇంకా తనకి ఎంతో కెరీర్ ఉంది. విరాట్ ని చూస్తే బహుశా ఇదే ఆఖరి టీ 20 ప్రపంచకప్ అని చెప్పాలి. అందువల్ల రాబోవు రోజుల్లో బాబర్ అజామ్ టీ 20 ప్రపంచకప్ లో నెంబర్ వన్ బ్యాటర్ గా కొన్నాళ్లు ఉంటాడనంలో సందేహం లేదనే చెప్పాలి. అయితే టీమ్ ఇండియా నుంచి వచ్చే యువతరం బాబర్ ఆజామ్ ని దాటాలంటే కొంత సమయం పడుతుంది.

బాబర్ అజామ్ టీ 20 మ్యాచ్‌ల్లో 41 సగటు, 129 స్ట్రైక్‌రేటుతో 4067 పరుగులు చేశాడు. విరాట్  కోహ్లి 118 ఇన్నింగ్స్‌ల్లో 51 సగటు, 137 స్ట్రైక్‌రేటుతో 4038 పరుగులు సాధించాడు. వీరి తర్వాత వరుసలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (4026) ఉన్నాడు.


Also Read: ముగిసిన శకం.. ఫుట్‌బాల్‌కు సునీల్‌ ఛెత్రి కన్నీటి వీడ్కోలు!

ఈ రికార్డులపై విరాట్ కొహ్లీ ఇటీవల కొన్ని ఆసక్తికరమైన మాటలు చెప్పాడు. అవేమిటంటే విరాట్ తన కొడుకు పుట్టినప్పుడు కొన్నాళ్లు అజ్నాతంలో ఉన్నాడు. తర్వాత బయట ప్రపంచంలోకి వచ్చి మీడియాతో మాట్లాడాడు. ఇంతకీ తను ఏమన్నాడంటే..

క్రికెట్ మ్యాచ్ లో గెలవాలని వందకి రెండు వందల శాతం ఆ రోజు కష్టపడతాం. ఎంతో శ్రమిస్తాం. ఈ క్రమంలో ఆరోజు ఎన్నో రికార్డులు సాధిస్తాం. కానీ అవేవి మనకు శాశ్వతం కాదని అన్నాడు. అవి ఏదొక రోజు మన కళ్ల ముందు నుంచే కనుమరుగైపోతుంటాయని అన్నాడు.

అయితే నేను చెప్పేదేమిటంటే ఇక్కడ రికార్డులు శాశ్వతం కాదు.. ఆ రోజు మ్యాచ్ లో మనం పొందిన ఉద్విగ్న క్షణాలు,  గెలుపు కోసం చివరి బంతి వరకు పడిన తాపత్రయం.. ఆ జ్నాపకాలే మనకు జీవితాంతం తోడుగా ఉంటాయని అన్నాడు.

Also Read: India vs Pakistan T20 World Cup Record: టీ 20 ప్రపంచకప్ లో.. పాకిస్తాన్ పై టీమ్ ఇండియా రికార్డు

క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఒకరోజు సాయంత్రం ఎక్కడైనా కూర్చుని ట్యాబ్ ఓపెన్ చేస్తే, నేను సాధించిన రికార్డులు అక్కడ కనిపించకపోవచ్చు. కానీ నా మనసులోంచి ఆ రోజు మ్యాచ్ గెలిచిన, ట్రోఫీ గెలిచిన జ్నాపకాలను, ఆ అనుభూతి మాత్రం ఎప్పటికి పోదని అన్నాడు. అదే నిజమైన ఆనందమని అన్నాడు. ఈ రికార్డులు కానే కాదనే జీవిత సత్యాన్ని తెలిపాడు. మరి నిజమే కదా..

Related News

BCCI : బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్… ఓజా, RP సింగ్ లకు కీలక పదవులు

IND Vs PAK : ఆసియా కప్ ఫైనల్.. ఫ్రీ లైవ్ ఎక్కడ చూడాలంటే..ఇక‌పై డీడీ స్పోర్ట్స్‌లోనూ?

IND Vs PAK : అర్ష్​ దీప్​ సింగ్ పై బ్యాన్‌…స‌రికొత్త కుట్ర‌ల‌కు తెగించిన‌ పాకిస్థాన్..!

IPL 2026: ఐపీఎల్ 2026లో కొత్త రూల్.. షాక్ లో ప్లేయర్లు… ఇకపై అక్కడ ఒక మ్యాచ్ ఆడాల్సిందే

IND Vs PAK : టీమిండియాతో ఫైన‌ల్‌..ఓపెన‌ర్ గా షాహీన్ అఫ్రిదీ..పాక్ అదిరిపోయే ప్లాన్‌

IND VS PAK Final: ఇండియాను వ‌ణికిస్తున్న పాత రికార్డులు..అదే జ‌రిగితే పాకిస్థాన్ ఛాంపియ‌న్ కావ‌డం పక్కా ?

IND Vs PAK : నోరు జారిన షోయబ్ అక్తర్.. అభిషేక్ బచ్చన్ ను సీన్ లోకి లాగి

IND VS PAK, Final: ట్రోఫీ ఇవ్వ‌నున్న‌ నఖ్వీ.. వాడిస్తే మేం తీసుకోబోమంటున్న టీమిండియా..!

Big Stories

×