BigTV English

India Vs Pakistan T20 World Cup Records: టీ 20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ పై టీమ్ ఇండియా రికార్డులు

India Vs Pakistan T20 World Cup Records: టీ 20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ పై టీమ్ ఇండియా రికార్డులు

Team India’s Record against Pakistan in T20 World Cup: టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియాకి ఆల్ టైమ్ రికార్డు ఉంది. ఇప్పటివరకు టీ 20 ప్రపంచకప్ లో రెండు జట్లు 7 మ్యాచ్ లు ఆడాయి. వాటిలో 6 మ్యాచ్ ల్లో టీమ్ ఇండియా విజయం సాధించింది. ఒకే ఒకసారి పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది. అనంతరం మళ్లీ అది రిపీట్ కాకుండా 2022లో విరాట్ కొహ్లీ అద్భుతంగా ఆడి (53 బంతుల్లో 82 నాటౌట్) జట్టుని గెలుపు బాటని పట్టించాడు. పాకిస్తాన్ పై చేయి సాధించకుండా అడ్డు పడ్డాడు.


  • టీ 20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లు ఇవే..
  • 2007 ప్రపంచకప్ లీగ్ లో డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాక్ పై భారతజట్టు బౌలౌట్ విజయం సాధించింది.
  • 2007లో జోహెన్స్ బర్గ్ స్టేడియంలో జరిగిన టైటిల్ సమరంలో భారత్ 5 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది.
  • 2012 కొలంబో వేదికగా జరిగిన టీ 20 ప్రపంచకప్ లో  భారత్ 8 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది.
  • 2014లో ఢాకా వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ లో  భారత్ 7 వికెట్లతో పాకిస్తాన్ పై అలవోకగా విజయం సాధించింది.

Also Read: అందరి చూపు అటువైపే.. నేడే భారత్-పాకిస్తాన్ పోరు

  • 2016 ప్రపంచకప్ లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో భారత్ 6 వికెట్లతో పాక్ పై విజేతగా నిలిచింది.
  • 2021 ప్రపంచకప్ లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. దుబాయ్ లో  భారత్ తో జరిగిన పోరులో పాకిస్థాన్ తొలిసారిగా అతిపెద్ద విజయం నమోదు చేసింది. 10 వికెట్లతో భారత్ ను ఓడించింది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
  • 2022లో మెల్బోర్న్ వేదికగా జరిగిన టీ ప్రపంచకప్ మ్యాచ్ లో భారత్ 4 వికెట్లతో పాక్ పై సంచలన విజయం సాధించింది. భారత స్టార్ విరాట్ కొహ్లీ అద్భుతంగా ఆడి మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. 2021 వైఫల్యానికి బదులు చెప్పాడు. అందరి నోళ్లూ మూయించాడు.


Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×