E-Paper
Advertisement

ఇక‌పై నా ఫోక‌స్ టీమిండియాపైనే..ప్ర‌తీ మ్యాచ్ లోనూ చిత్తుగా ఓడిస్తా

ఇక‌పై నా ఫోక‌స్ టీమిండియాపైనే..ప్ర‌తీ మ్యాచ్ లోనూ చిత్తుగా ఓడిస్తా
Advertisement

Babar Azam – Team India :  పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజం కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాను ఇకపై తాను ఫోకస్ చేయబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. భవిష్యత్తులో టీమిండియాతో ఏ మ్యాచ్ జరిగినా, పాకిస్తాన్ గెలిచేలా వ్యూహరచనలు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇటీవల పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ గా బాబర్ ఆజం పేరుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. షాన్ మసూద్ ను కాదని.. బాబర్ ఆజం కు మళ్లీ బాధ్యతలు అప్పగించారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో బాబర్ ఆజం కంటే మెరుగైన ఆటగాడు ఎవడు దొరకడం లేదు. దాదాపు మూడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. వేరే దిక్కు లేక మళ్ళీ బాబర్ ఆజంకు టెస్ట్ కెప్టెన్సీ అప్పగించాల్సి వచ్చింది. అయితే త్వరలోనే వన్డేల తో పాటు టి20 లకు కూడా బాబర్ ఆజం కెప్టెన్ అవుతాడని ప్రాథమిక సమాచారం అందుతోంది.

Also Read: Shahid Afridi Reaction On England vs India, 2nd T20I : ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓట‌మి.. టీమిండియా ప‌త‌నం మొద‌లైందంటూ అఫ్రిది సంచ‌ల‌నం !

ఇక‌పై నా ఫోక‌స్ టీమిండియాపైనే..ప్ర‌తీ మ్యాచ్ లోనూ చిత్తుగా ఓడిస్తా

Advertisement

మూడు ఫార్మాట్లకు బాబర్ ఆజం (Babar Azam) కెప్టెన్ అవుతాడు అన్న వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో… టీం ఇండియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. భవిష్యత్తులో టీమిండియాలో ( Team India) పాకిస్తాన్ ( Pakistan) చిత్తుచిత్తుగా ఓడిస్తుందని హెచ్చరించాడు బాబర్ ఆజం. ఇన్ని రోజులు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అంటూ సినిమా డైలాగులు కూడా చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబర్ ఆజం, టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. దాదాపు మూడు సంవత్సరాలుగా కష్టపడ్డాను కాబట్టి తనకు మళ్ళీ టెస్ట్ కెప్టెన్సీ ఇచ్చారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై క్రమశిక్షణ, ఫిట్ నెస్, పర్ఫామెన్స్ పైన దృష్టి సారిస్తానని వెల్లడించారు. తనతోపాటు టీం మెంబెర్స్ కూడా అన్ని రంగాల్లో దూసుకు వెళ్లేలా చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. ఇక టీమిండియాను కూడా భవిష్యత్తులో ఓడించి తీరుతానని శపథం చేశారు.

టీమిండియా కు చుక్కలు చూపిస్తా.. బాబర్ కాంట్రవర్సీ కామెంట్స్

పాకిస్తాన్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న బాబర్ ఆజం.. త్వరలోనే వన్డేలతో పాటు టి20 లకు కూడా కెప్టెన్ అవుతాడని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో టీం ఇండియాపై హాట్ కామెంట్స్ చేశారు బాబర్. ఇన్ని రోజులు పాకిస్తాన్ పై టీమిండియా అవలీలగా విజయం సాధించింది అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరించారు. పాకిస్తాన్ పై గెలవాలంటే, టీమిండియా మూడు చెరువుల నీళ్లు తాగాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. మొన్నటి వరకు తాను జట్టులో లేనని.. అందుకే టీమిండియా ప్లేయర్లు రెచ్చిపోయి ఆడినట్లు గుర్తు చేశారు. ఇకపై ఇండియాతో ఏ మ్యాచ్ జరిగిన కూడా తామే గెలుస్తామన్నారు.

Advertisement

 Also Read: Joshua Tromp names Haris Rauf as the toughest bowler: హారిస్ రవూఫ్ ఒక్క‌డే ప్ర‌పంచంలోనే భ‌యంక‌ర‌మైన బౌల‌ర్

Related News

అన‌వ‌స‌రంగా ట్రోల్ చేస్తున్నారు..శ్రేయ‌స్ క‌చ్చితంగా ధోని అంత‌టి కెప్టెన్ అవుతాడు

పేస్ బౌలింగ్ కు భ‌య‌ప‌డి, శివమ్‌ దూబేను డ‌గౌట్ లో దాచిపెడుతున్నారు

అంద‌రూ లెఫ్ట్ హ్యాండర్లే..శివమ్‌ దూబేను ప‌క్క‌కు పెట్టి, సంజును తీసుకోండి

వైభ‌వ్ ను ప‌క్క‌కు పెట్టి, హ‌ర్షిత్ రాణాను ఓపెన‌ర్ గా పంపించండి!

గంభీర్ నీకు బుర్ర ఉందా? సంజును కాకుండా ముందు నీ శిష్యుల‌ను తీసేయ్ !

పాడె మోసిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీ..క‌న్నీళ్లు ఆపుకోలేరు

శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే

Big Stories

Advertisement
×