E-Paper
Advertisement

పాడె మోసిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీ..క‌న్నీళ్లు ఆపుకోలేరు

పాడె మోసిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీ..క‌న్నీళ్లు ఆపుకోలేరు
Advertisement

Shapoor Zadran dies after prolonged illness:  ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ తాజాగా మరణించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ ( Hemophagocytic lymphohistiocytosis ) అనే అరుదైన వ్యాధితో ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (Shapoor Zadran) బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స కూడా పొందారు. ఎన్నో రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న షాపూర్ జద్రాన్ పరిస్థితి మంగళవారం విషమంగా మారింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఢిల్లీలో మరణించిన షాపూర్ జద్రాన్ మృతదేహాన్ని ఆఫ్గనిస్తాన్ దేశానికి తరలించారు ఢిల్లీ పోలీసులు. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ లో బుధవారం రోజున అంత్యక్రియలు కూడా జరిగాయి. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ మాజీ క్రికెటర్ షాపూర్ జద్రాన్ పాడె మోస్తూ కనిపించారు రషీద్ ఖాన్ (Rashid Khan), మహమ్మద్ నబీ (Mohammad Nabi). ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు చూసిన క్రికెట్ ఫ్యాన్స్ క‌న్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Also Read: Shahid Afridi Reaction On England vs India, 2nd T20I : ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓట‌మి.. టీమిండియా ప‌త‌నం మొద‌లైందంటూ అఫ్రిది సంచ‌ల‌నం !

షాపూర్ జద్రాన్ పాడెను మోసిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీ

Advertisement

గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ ఢిల్లీలో మరణించారు. మంగళవారం ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో మరణించిన అతడి మృతదేహాన్ని.. ఆఫ్ఘనిస్తాన్ తరలించారు. ఈ క్రమంలో ముస్లిం మత పద్ధతులలో షాపూర్ జద్రాన్ మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. అయితే ఈ అంత్యక్రియలలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ, ఇతర ఆఫ్గన్ క్రికెటర్లు అంత్యక్రియల్లో పాల్గొని, పాడె మోశారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.

షాపూర్ జ‌ద్రాన్ కు సోకిన హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ ఏంటి?

ఆఫ్ఘనిస్తాన్ మాజీ క్రికెటర్ షాపూర్ జద్రాన్ కు సోకిన హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ వ్యాధి  ( Hemophagocytic lymphohistiocytosis )  అత్యంత భయంకరమైనది. దీనివల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పూర్తిగా క్షీణించిపోతుంది. బ్యాక్టీరియా లేదా వైరస్ లకు బదులుగా సొంత అవయవాలే, రక్త కణాల పైన దాడి చేయడం ప్రారంభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల విపరీతమైన జ్వరం, కాలేయం వాపు, రక్త కణాలు తగ్గిపోవడం లాంటివి జరుగుతాయి. కామెర్లు, చర్మం పై దద్దుర్లు కూడా వస్తాయి. నాడీ వ్యవస్థ సమస్యలు తలెత్తుతాయి. అందుకే చ‌నిపోయే రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ మాజీ క్రికెటర్ షాపూర్ జద్రాన్ కు చ‌ర్మం పై ద‌ద్ద‌ర్లు క‌నిపించాయి.

Advertisement

 Also Read: Joshua Tromp names Haris Rauf as the toughest bowler: హారిస్ రవూఫ్ ఒక్క‌డే ప్ర‌పంచంలోనే భ‌యంక‌ర‌మైన బౌల‌ర్

 

Related News

శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే

76కే ఆలౌట్ అయ్యారు, టీమిండియా కోసం ఐంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్ పెట్టండి

వైభ‌వ్ కెరీర్ కు ఎండ్ కార్డ్ ప‌లికిన గంభీర్? ఇక నీ సేవ‌లు చాలంటూ!

MS DHONI: నేను ముసలోడిని అయిపోయా..ఇక ఐపీఎల్ ఆడ‌ను

టీమిండియాను కాదు..ముందు BCCIని త‌న్నాలి..డ‌బ్బుల కోసం క‌క్కుర్తి ప‌డి !

ఐపీఎల్ పిచ్ ల‌కు అల‌వాటు ప‌డ్డారు..ఇంగ్లండ్ లో టీమిండియా ఆట‌లు సాగ‌వు

గంభీర్ కు నిర‌స‌న సెగ‌..టీమిండియా బ‌స్సు క‌ద‌ల‌కుండా అడ్డుకున్న ఫ్యాన్స్‌

Big Stories

Advertisement
×