E-Paper
Advertisement

అంద‌రూ లెఫ్ట్ హ్యాండర్లే..శివమ్‌ దూబేను ప‌క్క‌కు పెట్టి, సంజును తీసుకోండి

అంద‌రూ లెఫ్ట్ హ్యాండర్లే..శివమ్‌ దూబేను ప‌క్క‌కు పెట్టి, సంజును తీసుకోండి
Advertisement

Parthiv Patel :  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య ఇవాళ సాయంత్రం 4వ టి20 జరగనుంది. ఇప్పటికే రెండింటిలో ఓడిపోయిన టీమిండియా, ఇవాళ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో సంజు శాంసన్ తిరిగి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే సంజు రావాలంటే, వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, లేదా ఇషాన్ కిషన్ లాంటి క్రికెటర్ లో ఎవరో ఒకరు తప్పుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం వైభవ్ సూర్య వంశీ ఇవాల్టి మ్యాచ్ లో ఆడే అవకాశాలు లేనట్లేనని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా యాజమాన్యానికి మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ (Parthiv Patel) కీలక సూచనలు చేశారు. టీమిండియా ఇవాళ ఆడబోయే నాలుగవ టి20 నేపథ్యంలో.. ఒకే ఒక్క చేంజ్ చేయాలని కోరారు. ప్ర‌స్తుత టీమిండియాలో అంద‌రూ లెఫ్ట్ హ్యాండర్లే ఉన్నార‌ని తెలిపారు. అందుకే శివమ్‌ దూబేను ప‌క్క‌కు పెట్టి, సంజును తీసుకోండి అంటూ మాజీ వికెట్ కీప‌ర్ పార్థివ్ ప‌టేల్ సూచ‌న‌లు చేశారు. ఇలా చేస్తే, టీమిండియా మెరుగైన ఆట‌తీరును క‌న‌బ‌రిచే ఛాన్సులు ఉంటాయ‌ని వివ‌రించారు.

Also Read: Shahid Afridi Reaction On England vs India, 2nd T20I : ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓట‌మి.. టీమిండియా ప‌త‌నం మొద‌లైందంటూ అఫ్రిది సంచ‌ల‌నం !

అంద‌రూ లెఫ్ట్ హ్యాండర్లే..దూబేను ప‌క్క‌కు పెట్టి, సంజును తీసుకోండి

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నాలుగవ టి20 (England vs India, 4th T20I) జరగనున్న నేపథ్యంలో తానే జట్టును ఎంపిక చేయాల్సి వస్తే.. శివం దుబే స్థానంలో సంజు శాంసన్ ను ఫైనల్ చేస్తానని వెల్లడించారు మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ (Parthiv Patel). ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తిలక్ వర్మను తొలగించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కానీ అతడు వైస్ కెప్టెన్ అన్న విషయాన్ని ఎవరు గుర్తించడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. వైస్ కెప్టెన్ ను అస్సలు టచ్ చేయకూడదని కోరారు.

శివం దూబేను ( Shivam dube) పక్కకు పెట్టి సంజు శాంసన్ కు  ( Sanju samson)  అవకాశం ఇవ్వాలని స్పష్టం చేశారు. అలా చేస్తే, టీమిండియా కు ఆరవ బౌలర్ వెలితి ఉంటుందన్నారు. కానీ ఈ టి20 మ్యాచ్ లలో ఐదుగురు బౌలర్లు సరిపోతారన్నారు. అవసరమనుకుంటే అభిషేక్ శర్మతో కూడా ఒకటి లేదా రెండు ఓవర్లు వేయించవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శివం దుబేను పక్కకు పెడితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే అరడజనుకు పైగా టీమిండియాలో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని.. ఇలాంటి క్రమంలో సంజు శాంసన్ జట్టులోకి వస్తే అడ్వాంటేజ్ ఉంటుందన్నారు మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ (Parthiv Patel).

Advertisement

 Also Read: Joshua Tromp names Haris Rauf as the toughest bowler: హారిస్ రవూఫ్ ఒక్క‌డే ప్ర‌పంచంలోనే భ‌యంక‌ర‌మైన బౌల‌ర్

Related News

పేస్ బౌలింగ్ కు భ‌య‌ప‌డి, శివమ్‌ దూబేను డ‌గౌట్ లో దాచిపెడుతున్నారు

వైభ‌వ్ ను ప‌క్క‌కు పెట్టి, హ‌ర్షిత్ రాణాను ఓపెన‌ర్ గా పంపించండి!

గంభీర్ నీకు బుర్ర ఉందా? సంజును కాకుండా ముందు నీ శిష్యుల‌ను తీసేయ్ !

పాడె మోసిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీ..క‌న్నీళ్లు ఆపుకోలేరు

శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే

76కే ఆలౌట్ అయ్యారు, టీమిండియా కోసం ఐంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్ పెట్టండి

వైభ‌వ్ కెరీర్ కు ఎండ్ కార్డ్ ప‌లికిన గంభీర్? ఇక నీ సేవ‌లు చాలంటూ!

Big Stories

Advertisement
×