E-Paper
Advertisement

వైభ‌వ్ ను ప‌క్క‌కు పెట్టి, హ‌ర్షిత్ రాణాను ఓపెన‌ర్ గా పంపించండి!

వైభ‌వ్ ను ప‌క్క‌కు పెట్టి, హ‌ర్షిత్ రాణాను ఓపెన‌ర్ గా పంపించండి!
Advertisement

Kris Srikkanth:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటివరకు మూడు టి20 లు ఫినిష్ అయ్యాయి. ఇవాళ నాల్గవ టి20 బ్రిస్టల్ వేదికగా జరగనుంది. అయితే ఈ టి20 సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన టీమిండియా.. ఇవాల్టి మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. రెండో టి20 లో పోరాడి ఓడిన టీమిండియా.. మూడో టి20 లో మాత్రం చేతులెత్తేసింది. ముఖ్యంగా శివం దుబే కంటే ముందుగా హర్షిత్ రాణాను బ్యాటింగ్ కు పంపడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించి, సెటైరికల్ కామెంట్స్ చేశారు. హర్షిత్ రాణాను మిడిల్ ఆర్డర్ లో పంపడం కంటే.. పంపించండి అంటూ పేర్కొన్నారు. అప్పుడైనా గౌతమ్ గంభీర్ కడుపు మంట చల్లారుతుందని హేళన చేశారు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ పై క్రిస్ శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

 Also Read: Joshua Tromp names Haris Rauf as the toughest bowler: హారిస్ రవూఫ్ ఒక్క‌డే ప్ర‌పంచంలోనే భ‌యంక‌ర‌మైన బౌల‌ర్

వైభ‌వ్ ను ప‌క్క‌కు పెట్టి, హ‌ర్షిత్ రాణాను ఓపెన‌ర్ గా పంపించండి!

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొన్న మూడవ టి20 జరిగింది. ఈ సందర్భంగా టీమిండియా 76 పరుగులకే ఆల్ అవుట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ డిస్టబ్ చేశాడు గంభీర్. పీకల్లోతు టీమిండియా కష్టాల్లో పడ్డప్పుడు హర్షిత్ రాణాను ముందుగా బ్యాటింగ్ కు పంపాడు. శివం దుబేను కాదని హర్షిత్ కు ప్రాధాన్యత ఇచ్చాడు గంభీర్. అయితే దీనిపై దినేష్ కార్తీక్ లైవ్ కామెంట్రీ లో కూడా షాక్ అయ్యాడు. గంభీర్ కు ఏమైనా బుద్ధుందా అన్న రేంజ్ లో రియాక్షన్ ఇచ్చాడు. అయితే ఇదే అంశంపై క్రిస్ శ్రీకాంత్ సెటైరికల్ గా స్పందించారు.

శివం దుబే కంటే తోపు ఆటగాడా? హర్షిత్ రాణాకు అంతలా ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నావు ? కొంచమైనా బుద్ధి ఉందా అంటూ గంభీర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ శిష్యుడైతే ఇంట్లో భోజనం బాగా పెట్టు… కావాలంటే మందు పార్టీ ఇవ్వు.. కానీ అతడి కోసం టీమిండి అని బలి చేయొద్దు అంటూ ఫైర్ అయ్యారు. నాలుగో టి20 లో వైభవ్ ను పక్కకు పెట్టి, హర్షిత్ రాణాను ఓపెనర్ గా దించినా కూడా ఆశ్చర్య పోవాల్సిన పని లేదన్నారు. కేకేఆర్ జట్టులో సునీల్ నరేన్ విషయంలో నువ్వు సక్సెస్ అయ్యావు కావచ్చు.. అన్నిచోట్ల అది వర్కౌట్ కాదన్నారు. ఇప్పటికైనా అసలు నిజం తెలుసుకొని.. బ్యాటింగ్ ఆర్డర్ డిస్టబ్ చేయకుండా గమ్మున కూర్చో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: Shahid Afridi Reaction On England vs India, 2nd T20I : ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓట‌మి.. టీమిండియా ప‌త‌నం మొద‌లైందంటూ అఫ్రిది సంచ‌ల‌నం !

Related News

ఢిల్లీ పోలీసులు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం పక్కా..ఇక అన్ని సిక్సర్లు, బౌండరీలే!

హార్ధిక్ పాండ్యా, బుమ్రా లేకపోతే..టీమిండియాను ఉగాండా కూడా చిత్తుగా ఓడిస్తుంది

మైదానంలోకి వ‌చ్చి గంభీర్ రౌడీయిజం చేశాడు…ఓట‌మి భ‌యంతో రెచ్చిపోయాడు

సోష‌ల్ మీడియా వార్‌…పాపం, గిల్ చేసిన త‌ప్పుకు శ్రేయ‌స్ సేన బ‌లి

వాడికి బ్యాటింగ్ రాదు, బౌలింగ్ చేత‌కాదు…టీమిండియా ఓట‌మి కార‌ణం శివ‌మ్ దూబేనే

బౌండ‌రీ సైజు 80 మీటర్లు చేయండి..లేక‌పోతే 500ల ప‌రుగులు చేసినా క‌ష్ట‌మే

సంజు శాంస‌న్ సెంచ‌రీ మిస్…వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి

విరాట్ కోహ్లీకి బలుపెక్కువ…బుమ్రా లేదు, వుమ్రా లేదంటూ తక్కువ అంచనా వేశాడు

Big Stories

Advertisement
×