BigTV English

BAN vs NZ 2nd Test : ఉత్కంఠ పోరు .. రెండో టెస్ట్ లో గెలిచిన కివీస్

BAN vs NZ  2nd Test : ఉత్కంఠ పోరు .. రెండో టెస్ట్ లో గెలిచిన కివీస్

BAN vs NZ 2nd Test : బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో ఓటమి అంచుల వరకు వెళ్లిన కివీస్ రెండు ఇన్నింగ్స్ లో గ్లెన్ ఫిలిప్స్ పుణ్యమాని విజయం సాధించి పరువు నిలబెట్టుకుంది. లేదంటే మొదటి టెస్ట్ మ్యాచ్ లో 150 పరుగుల తేడాతో పరాజయం పాలై, తలెత్తుకోలేని స్థితిలో రెండో టెస్ట్ కు వెళ్లింది.


బంగ్లాదేశ్-కివీస్ మధ్య జరిగిన రెండోటెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 172 పరుగులకి ఆలౌట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ ఒక దశలో 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అక్కడ నుంచి గ్లెన్ ఫిలిప్స్ 87 పరుగులు చేసి ఆదుకున్నాడు. జట్టు స్కోరుని 180 పరుగులకి తీసుకెళ్లాడు.

8 పరుగుల ఆధిక్యంతో కివీస్ ముందడుగు వేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఈసారి ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 144 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  కివీస్ బౌలింగ్ లో అజాజ్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు పడగొట్టి మ్యాచ్ ని మలుపు తిప్పేశాడు. శాంట్నర్ 3, టిమ్ సోథీ 1 వికెట్టు తీసి అతనకి సహకరించారు.


ఇప్పుడు విజయమో వీరస్వర్గమో తేల్చుకునే సమయం కివీస్ కి వచ్చింది. రెండో ఇన్నింగ్స్ లో 137 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగింది. కానీ పిచ్ మీద బంగ్లాదేశ్ బౌలర్లని ఎదుర్కోవడం అంత ఈజీగా అనిపించలేదు. 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మళ్లీ ఎదురీత మొదలెట్టింది.

తొలి ఇన్నింగ్స్ లాగే మళ్లీ గ్లెన్ ఫిలిప్స్ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు. ఒంటరిగా పోరాడాడు. తన ముందు సహచరులు అందరూ ఒకొక్కరూ వెనుతిరుగుతున్నా మొండి ధైర్యంతో క్రీజులో నిలబడి, మరో ఎండ్ లో శాంటర్న్ (35)తో కలిసి లక్ష్యానికి అవసరమైన 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడమే కాదు, జట్టుని విజయ పథంలో నడిపించాడు.

ముఖ్యంగా న్యూజిలాండ్ పరువు కాపాడాడు. ఇక రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న కెప్టెన్ కెన్ విలియమ్సన్ కి మనశ్శాంతిని ప్రసాదించాడు. మొత్తానికి సిరీస్ ని డ్రా చేయగలిగారు.  ప్రశాంతంగా స్వదేశానికి ముఖాలపై నవ్వులతో బయలుదేరుతున్నారు. బంగ్లాదేశ్ బౌలింగ్ లో షోరిఫుల్ ఇస్లాం 1, మెహిది హాసన్ మిరాజ్ 3, తైజుల్ ఇస్తాం 2 వికెట్లు తీసుకున్నారు.

Related News

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Big Stories

×