Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4 తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బంగ్లాదేశ్ శ్రీలంక పై విజయం సాధించింది. దీంతో బంగ్లా ఆటగాళ్లు ఒక్కసారిగా సంబురాలు జరుపుకున్నారు. మరోవైపు స్టేడియంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు సైఫ్ హాసన్, తౌహిద్ హృదోయ్ సిక్స్ లు, ఫోర్లతో రెచ్చిపోయి హాఫ్ సెంచరీ చేశారు. దీంతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఈ సందర్భంగా దుబాయ్ స్టేడియంలో బంగ్లాదేశ్ అభిమానులు నాగిని డ్యాన్స్ తో సంబురాలు జరుపుకున్నారు. ప్రస్తుతం బంగ్లా అభిమానులు చేసిన నాగిని డ్యాన్స్ వీడియో ఆకట్టుకుంటోంది.
Also Read : IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
ఆ వీడియో చూడగానే నాగిని డ్యాన్స్ ఇలా కూడా చేయవచ్చా..? ఇంత చేశారు అనేలా ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య నాగిని డ్యాన్స్ అనేది చాలా కామన్. ఎవ్వరూ విజయం సాధిస్తే.. ఆ టీమ్ అభిమానులు నాగిని డ్యాన్స్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక కు కుశాల్ మెండిస్ (34), నిశాంక (22), శుభారంభాన్నందించారు. ఈ జోడీ తొలి వికెట్ కి 5 ఓవర్లలో 44 పరుగులు జోడించింది. అయితే ఓపెనర్లతో పాటు కామిల్ మిసార5 పరుగులకే ఔట్ కావడంతో శ్రీలంక జట్టు కస్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో శనక పట్టుదలతో నిలిచాడు. మరో ఎండ్ లో వికెట్లు పడుతున్నప్పటికీ.. అతను భారీ షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అసలంక (21)తో శనక 5వ వికెట్ కి 57 పరుగులు జోడించారు. శనక 64 నాటౌట్ గా నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది శ్రీలంక జట్టు.
Also Read : IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
బంగ్లాదేశ్ 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. బంగ్లా ఓపెనర్ సైఫ్ హాసన్ 61 , తౌహిద్ హృదోయ్ 58 చెలరేగడంతో 169 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తంజిద్ 0, తొలి ఓవర్ లోనే ఔట్ అయ్యాడు. లిట్టన్ దాస్ 23, తౌహిద్ లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన సైఫ్ జట్టు విజయానికి బాటలు పరిచాడు. సైఫ్ ఔట్ అయినప్పటికీ తౌహిద్ దూకుడు కొనసాగించడంతో బంగ్లాదేశ్ విజయానికి చేరువైంది. చివర్లో టప్ప టప్ప మూడు వికెట్లు పడ్డప్పటికీ బంగ్లాదేశ్ మాత్రం ఉత్కంఠకు తెరదించింది. ఈ మ్యాచ్ లో తన తండ్రి మరణించిన తరువాత తిరిగి జట్టుతో చేర్చాడు. తాను దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న తండ్రి ఆశయానికి విలువ ఇస్తూ అతడు.. ఆ ఒక్క రోజు వ్యవదిలో స్వదేశం నుంచి బయలుదేరి మ్యాచ్ ఆడాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు అతని తండ్రి సురంగ వెల్లలాగేకి సంతాపం ప్రకటించారు.
Asia Cup match today 😂: pic.twitter.com/PzB0ZbvwK6
— Out Of Context Cricket (@GemsOfCricket) September 20, 2025