U19 Asia Cup 2024 Final: ఆసియా కప్ విజేతగా బంగ్లాదేశ్ అండర్ 19 జట్టు నిలిచింది. దీంతో… ఎనిమిది సార్లు కప్పు విజేతగా గెలిచిన… టీమిండియా రన్నరప్ గా నిలిచింది. ఆసియా కప్ అండర్ 19 ఫైనల్లో… అవలీలగా బంగ్లాదేశ్ విజయం సాధించింది. టీమిండియా పై ఏకంగా 59 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ విజేతగా నిలిచింది బంగ్లాదేశ్.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 198 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది టీమిండియా. దీంతో 139 పరుగులకే కుప్ప కూలింది. ఈ తరుణంలోనే బంగ్లాదేశ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అటు టీమిండియా…ఫైనల్ లో ఓడిన జట్టుగా మిగిలింది.
ఇక మ్యాచ్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే… మొదట బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. మొదటి బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసి 49.1 ఓవర్లు వాడింది. ఇందులో బంగ్లాదేశ్ 198 పరుగులు చేసి ఆల్ అవుట్ కావడం జరిగింది. టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌల్ చేయడంతో… 198 పరుగులకు కట్టడి చేయగలిగారు. అటు 198 పరుగులు చేసేందుకు బంగ్లాదేశ్ అష్ట కష్టాలు పడిందని చెప్పవచ్చు.
బంగ్లాదేశ్ బ్యాటరీలలో రీజన్ హుస్సేన్ ఒక్కడే 65 బంతుల్లో 47 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇందులో మూడు ఫోర్లు కూడా ఉన్నాయి. అతని తర్వాత మహమ్మద్ సిహాబ్ జేమ్స్… 67 బంతుల్లో 40 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో ఒక సిక్సర్ తో పాటు మూడు ఫ్లోర్లు ఉన్నాయి. ఇక టీమ్ ఇండియా బౌలర్లలో… దాదాపు అందరూ బౌలింగ్ బాగానే చేశారు.
యుధజిత్ గుహ 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టడం జరిగింది. అటు చేతన్ శర్మ 42 పరుగులు భారీగానే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక మరొక బౌలర్ హార్దిక్ రాజ్ 41 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టడం జరిగింది. ఇక అటు కిరణ్, కార్తికేయ, ఆయుష్ తలో వికట్టు తీసి దుమ్ము లేపారు. కానీ బ్యాటింగ్… విభాగంలో మాత్రం టీమిండియా పెద్దగా రాణించలేదు. దీంతో అండర్ 19 టీమిండియా 35.2 ఓవర్లలో 139 పరుగులు చేసి ఆల్ అవుట్ కావడం జరిగింది.
Also Read: Pink Ball vs Red Ball: పింక్ బాల్ వర్సెస్ రెడ్ బాల్… వీటి మధ్య తేడా ఇదే!
ఇక టీమిండియా బ్యాటర్లలో… మాత్రమే.. ఒంటరి పోరాటం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అండర్ 19 టీమిండియా కెప్టెన్ మహమ్మద్ అమాన్ 65 బంతులు ఆడి కేవలం 26 పరుగులే చేశాడు. అతనే టీమ్ ఇండియా టాప్ స్కోరర్ గా నిలవడం గమనార్హం. ఇక మిగతా ప్లేయర్లు ఎవరూ కూడా పెద్దగా రాణించలేదు. ముఖ్యంగా సంచలన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ… ఏదో అద్భుతం చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఆశలను గల్లంతు చేస్తూ దారుణంగా విఫలమయ్యాడు రాజస్థాన్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. ఏడు బంతులు ఆడిన వైభవ్ సూర్యవంశీ 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో రెండు ఫోర్లు కూడా ఉన్నాయి.