Ind vs Aus 2nd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా పది వికెట్ల తేడాతో టీమిండియా పై విజయం సాధించింది కంగారు జట్టు. దీంతో ఐదు టెస్టులు సిరీస్ ను 1-1 తేడాతో సమం చేసింది ఆస్ట్రేలియా జట్టు. ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు నుంచి అద్భుతంగా ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టు… టీమిండియా కు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. బౌలింగ్, బ్యాటింగ్ ఇలా రెండు రంగాల్లోనూ… కంగారు జట్టు అద్భుతంగా ఆడింది.
Also Read: Siraj vs Travis head: తగ్గేదేలే..హెడ్, DSP సిరాజ్ మధ్య వార్ ?
రెండో ఇన్నింగ్స్ లో… 19 పరుగుల లక్ష్యాన్ని… వికెట్ నష్టపోకుండా చేదించింది ఆస్ట్రేలియా. దీంతో.. రెండవ టెస్టులో టీమిండియా కు ఘోర ఓటమి తప్పలేదు. ఈ టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి రెండు జట్లకు ఉన్నప్పటికీ… టీమిండియా మాత్రం మొదటి టెస్టుల్లో గెలిచిన… ఓవర్ కాన్ఫిడెన్స్ తో బోల్తా పడింది. కానీ ఆస్ట్రేలియా మాత్రం ఖచ్చితంగా గెలవాలనే కసితో… ఆడింది. దీని ఫలితంగానే రెండవ టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
అడిలైడ్ టెస్ట్‌లో భారత్ ఘోర పరాజయం కావడానికి భారత్ బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు కారణం.అడిలైడ్ టెస్ట్‌లో భారత్ బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.
మొదటి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే భారత్ ఆలౌట్ కాగా… రెండో ఇన్నింగ్స్ లో కూడా పెద్దగా రాణించలేదు. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగిన ఆసీస్ బౌలర్ స్టార్క్.. భారత ప్లేయర్ల నడ్డి విరిచాడు. ఇక అటు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ 337 ఆలౌట్ కావడం జరిగింది.
ఈ ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో హెడ్ 140 పరుగులు, లబుషేన్ 64, స్వీని 39 పరుగులు చేసి సత్తా చాటారు. అటు తొలి ఇన్నింగ్స్‌లో బూమ్రా, సిరాజ్ చెరో 4 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ చేతులెత్తేసిన భారత్ బ్యాటర్లు… ఒకరి వెనుక మరొకరు పెవిలీయన్ కు దారి పట్టారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకే కుప్పకూలింది టీమిండియా. అటు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్… భారత ప్లేయర్ల నడ్డి విరిచాడు.
దీంతో ఈ ఒక్క మ్యాచ్ లోనే… ఇద్దరూ ఆసీస్ బౌలర్లు రెచ్చిపోయి.. టీమిండియాను దెబ్బతీశారు. ఇక ఆసీస్ ముందు కేవలం 19 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన భారత్.. ఆ లక్ష్యాన్ని కాపాడుకులేని పరిస్థితి నెలకొంది. దీంతో 19 పరుగుల విజయలక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది ఆసీస్. ఇక అటు భారత్‌కు ఇన్నింగ్స్ ఓటమి తప్పించాడు నితీష్‌రెడ్డి. రెండో టెస్ట్‌లో స్టార్క్ 8, కమ్మిన్స్ 7, బోలాండ్‌కు 5 వికెట్లు పడగొట్టారు. ఇక టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మరో మూడు టెస్ట్‌లు ఉన్నాయి. ఇక ఈ గెలుపుతో.. WTC Points Tableలో మొదటి స్థానానికి చేరుకుంది ఆసీస్. టీమిండియా 3వ స్థానానికి చేరుకుంది.
Also Read: Pink Ball vs Red Ball: పింక్ బాల్ వర్సెస్ రెడ్ బాల్… వీటి మధ్య తేడా ఇదే!