BigTV English

Ram Gopal Varma: అల్లు అర్జున్‌కు హిందీ రాదు, ఇప్పుడు తనే బాలీవుడ్‌లో పెద్ద స్టార్.. ఈయన తిట్టారా? పొగిడారా?

Ram Gopal Varma: అల్లు అర్జున్‌కు హిందీ రాదు, ఇప్పుడు తనే బాలీవుడ్‌లో పెద్ద స్టార్.. ఈయన తిట్టారా? పొగిడారా?

Ram Gopal Varma About Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ సినిమా గురించి ప్రేక్షకులు చాలానే మాట్లాడుకున్నారు. విడుదలయిన రెండో రోజుకే ఈ సినిమాకు హైప్ తగ్గిపోయిందని అనిపించినా బన్నీ ఫ్యాన్స్ ఆ హైప్ ఏ మాత్రం తగ్గకూడదనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియాలో ఇంకా ట్రెండ్స్ చేస్తూనే ఉన్నారు. పదేపదే సినిమాకు వెళ్లి దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను తమ సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ‘పుష్ప 2’ను అస్సలు వదలడం లేదు. ఇప్పటికే ఈ మూవీ గురించి చాలా గొప్పగా మాట్లాడిన ఆర్జీవీ.. తాజాగా దీనికి సంబంధించిన తన స్టైల్‌లో మరో ట్వీట్ వేశారు.


నార్త్ టార్గెట్

‘పుష్ప 2’ సినిమాకు సౌత్‌లో ఎంత క్రేజ్ ఉందో నార్త్‌లో కూడా అంతే క్రేజ్ లభిస్తోంది. అక్కడి ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. కలెక్షన్స్ కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయి. ఇప్పటివరకు అల్లు అర్జున్‌కు నార్త్‌లో పెద్దగా మార్కెట్ లేదు. కానీ ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ ఏంటో నార్త్ ఆడియన్స్‌కు కూడా తెలిసింది. అందుకే నార్త్‌లో ‘పుష్ప 2’ను ఎలాగైనా హిట్ చేయాలని పలు ఎలిమెంట్స్‌ను ప్రత్యేకంగా యాడ్ చేశాడు దర్శకుడు సుకుమార్. ఆయన ప్లాన్ వర్కవుట్ అయ్యింది. నార్త్‌లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ మార్గంలో దూసుకుపోతోంది. అలా ‘పుష్ప 2’ నార్త్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంపై ఆర్జీవీ (RGV) ట్వీట్ వేశారు.


Also Read: మళ్లీ పెంట చేసిన బన్నీ.. బంధాలు కూడా గుర్తు రానంతగా..?

ఆ ప్రస్తావన ఎందుకు?

‘బాలీవుడ్ హిస్టరీలోనే అతిపెద్ద హిందీ సినిమాగా తెరకెక్కింది ఒక తెలుగు డబ్బింగ్ చిత్రమైన పుష్ప 2. బాలీవుడ్ హిస్టరీలోనే అదిపెద్ద హిందీ యాక్టర్‌గా నిలిచింది ఒక హిందీ మాట్లాడలేని తెలుగు యాక్టర్ అయిన అల్లు అర్జున్. కాబట్టి పాన్ ఇండియా అనేది ఇంక లేదు. ఇకపై అంతా తెలుగు ఇండియానే’ అంటూ తెలుగు సినీ పరిశ్రమ ఎదగడంపై గర్వపడ్డారు రామ్ గోపాల్ వర్మ. అంతా బాగానే ఉన్నా అల్లు అర్జున్ హిందీ మాట్లాడలేడు అనే విషయాన్ని ఈ ట్వీట్‌లో ప్రస్తావించడం ఎందుకు? అసలు ఈయన బన్నీని తిట్టారా, పొగిడారా, లేక వ్యంగ్యంగా మాట్లాడారా అని నెటిజన్లు కన్ఫ్యూజన్‌లో పడ్డారు.

మిక్స్‌డ్ రెస్పాన్స్

అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కలిసి మూడేళ్లుగా ‘పుష్ప 2’ (Pushpa 2) కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఆ కష్టమంతా తెరపై కనిపిస్తుందని కొందరు ప్రేక్షకులు తెగ పొగిడేస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఈ సినిమా చాలా యావరేజ్ బొమ్మ అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తే ‘పుష్ప 2’కు మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తుందని అర్థమవుతోంది. అయినా కూడా కలెక్షన్స్ విషయంలో ఈ మూవీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీనికి పెరిగిన టికెట్ ధరలు కూడా కారణమే. కానీ సోమవారం నుండి చాలావరకు థియేటర్లలో టికెట్ ధరలు మామూలు రేంజ్‌కు వచ్చేయనున్నాయి. దీంతో మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×