Washing Machine Mistake: మామూలుగా మన ఇంటిలో ఉపయోగించే వస్తువులు, ముఖ్యంగా ఎలక్ట్రికల్‌తో ఉపయోగించే యంత్రాలు మన జీవితం సులభం చేసే సాధనాలు. కానీ వాటిని సరైన జాగ్రత్తలు లేకుండా వాడితే వాటి వల్ల తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశముంది. ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఘటన సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి వాషింగ్ మెషీన్ వాడుతున్న సమయంలో ఎలక్ట్రిక్ షాక్ తగిలి మరణించాడు.
ఈ వీడియోలో ఆ వ్యక్తి వాషింగ్ మెషీన్ లో కడగడానికి ముందు డిటర్జెంట్ వేసి, మెషీన్ ఆన్ చేశాడు. ఆ తర్వాత వాషింగ్ వాషింగ్ మెషీన్ లో నీరు వచ్చాయి. నీటిలో తన చేయి పెట్టిన వెంటనే, అప్లయెన్సీలో ఉన్న ఎలక్ట్రికల్ లీకేజి కారణంగా అతనికి భారీ ఎలక్ట్రిక్ షాక్ తగిలింది. ఈ షాక్ వల్ల అతను అక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం వెంటనే ప్రాణం కోల్పోయాడు. ఈ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు.
జాగ్రత్తలు తీసుకోకపోవడమే దీనికి గల కారణం అంటున్నారు. ఇలాంటి విషమాలు కొత్త విషయం కాదు. ఇటీవలే లక్నోలో 28 సంవత్సరాల ఇర్ఫాన్ అనే ఫాస్ట్ ఫుడ్ విక్రేత తన వాషింగ్ మెషీన్‌ను మరమ్మతు చేసుకునేందుకు ప్రయత్నించగా ఇలానే షాక్ తగిలి మృతి చెందాడు. అతనిని వెంటనే లోహియా ఆసుపత్రికి తరలించినా పలితం లేకుండా పోయింది. అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఎలక్ట్రికల్ అప్లయెన్సులను జాగ్రత్తగా వాడకపోతే, వాటి వల్ల ఎన్నో ప్రాణహానులు జరిగే అవకాశముందని ఇలాంటి ఘటనలు మనకు స్పష్టంగా చెపుతున్నాయి.
ఎలక్ట్రికల్ షాక్‌ను నివారించడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు:
ఇవి పాటించకపోతే, మన జీవితాలకు పెద్ద ప్రమాదం దూరం కాదు. ముఖ్యంగా వాషింగ్ మెషీన్, నీటి దగ్గర ఉన్న ఎలక్ట్రికల్ యంత్రాలు చాలా జాగ్రత్తగా వాడాలి. ఈ విషాద సంఘటనలు మనందరికీ ఒక పాఠంగా, ఇలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తాయి. ఎప్పుడూ అప్లయెన్సులు వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి, అటువంటి ప్రమాదాలకు దూరంగా ఉండండి.