PM Shehbaz Sharif On IND VS PAK: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026) భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా పై 48 పరుగుల తేడాతో పాకిస్తాన్ జూనియర్ జట్టు సూపర్ విక్టరీ అందుకుంది. అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ సందర్భంగా ఓడిపోయిన పాకిస్తాన్ ప్లేయర్లు… ఇందులో కసిగా ఆడి టీమిండియాను చిత్తుగా ఓడించారు. ఇక టీమిండియాను (Team India) ఓడించిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లకు (Pak Players) ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (PM Shehbaz Sharif) శుభాకాంక్షలు తెలిపినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆదివారం మ్యాచ్ జరగగా సోమవారం నేషనల్ హాలిడే (National Holiday In Pakistan) ప్రకటించినట్టు పోస్టులు వైరల్ అవుతున్నాయి.
టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ ప్లేయర్లందరికీ దోహా వేదికగా బుధవారం డిన్నర్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటన చేసినట్టు సమాచారం అందుతోంది. టీమిండియా పై విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన పేర్కొన్నాడట. ఫైనల్స్ లో గెలిస్తే పాకిస్తాన్ ప్లేయర్లకు భారీ నజరానా కూడా ఇస్తానని ప్రకటన చేసినట్టు సమాచారం అందుతోంది. గతంలో కూడా టీమిండియాపై పాకిస్తాన్ గెలిచిన సందర్భంగా నేషనల్ హాలిడే ప్రకటించినట్టు ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేరుతో పోస్టులు వైరల్ అయ్యాయి. ఇప్పుడు కూడా అలాంటి వార్తలే బయటకు వచ్చాయి. ఇందులో ఎంత మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026) నేపథ్యంలో ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. 49.2 ఓవర్లు ఆడి 313 పరుగులు సాధించింది. హసన్ నవాజ్ విరోచిత పోరాటం నేపథ్యంలో భారీ స్కోరు సాధించగలిగింది పాకిస్తాన్. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది టీమిండియా. అయినప్పటికీ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ పోరాడే ప్రయత్నం చేశారు. మరో ఎండ్ వైపు వికెట్లు పడడంతో ఒత్తిడికి గురైన టీమ్ ఇండియా ఓడిపోయింది. అటు టీమిండియాపై గెలిచిన పాకిస్తాన్… సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. నవంబర్ 24వ తేదీన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుపై విక్టరీ కొడితేనే టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్లనుంది.