E-Paper
Advertisement

హ‌ర్షిత్ రాణాకు ఒళ్లంతా పొగ‌రే.. వీడు ఎక్కువ రోజులు టీమిండియాలో నిల‌దొక్కుకోలేడు

హ‌ర్షిత్ రాణాకు ఒళ్లంతా పొగ‌రే.. వీడు ఎక్కువ రోజులు టీమిండియాలో నిల‌దొక్కుకోలేడు
Advertisement

Sanjay Manjrekar Blasts Harshit Rana: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026) నేపథ్యంలో హర్షిత్ రాణా (Harshit Rana) వ్యవహారం హాట్ టాపిక్ అయింది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ప్రతి ఒక్క ఆటగాడితో హర్షిత్ రాణా గొడవ పడ్డట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముందు పాకిస్తాన్ వాళ్ళు గెలికారా? లేక హర్షిత్ రాణా రెచ్చగొట్టాడా ? అనేది తెలియదు కానీ… సోషల్ మీడియాలో మాత్రం హర్షిత్ రాణా పేరు మారుమోగుతోంది.

హ‌ర్షిత్ రాణాకు ఒళ్లంతా పొగ‌రే.. వీడు ఎక్కువ రోజులు టీమిండియాలో ఉండ‌డు

ఈ నేపథ్యంలో హర్షిత్ రాణా వ్యవహారం పై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) హాట్ కామెంట్స్ చేశాడు. బంతి, బంతికి పాకిస్తాన్ ప్లేయర్లతో హర్షిత్ రాణా గొడవ పెట్టుకోవడం చాలా దారుణమని మండిపడ్డాడు. అతనికి ఒళ్లంతా పొగరే ఉందని.. ఇలాంటి వాళ్లు టీమిండియాలో ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేరని బాంబు పేల్చాడు. మొదటి నుంచి పాకిస్తాన్ ప్లేయర్లను గెలికిన హర్షిత్ రాణా… డకౌట్ మళ్లీ వాళ్ల చేతిలోనే తిట్లు తిన్నాడని సెటైరికల్ కామెంట్స్ చేశాడు. గెలికి మరి తన్నించుకోవడం అంటే ఇదే అంటూ హాట్ కామెంట్స్ చేశాడు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

హ‌ర్షిత్ రాణా గెలికి త‌న్నించుకున్నాడు!

హర్షిత్ రాణా ప్రవర్తనపై సంజయ్ మంజ్రేకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియా తరఫున ఆడడం అంటే ఎంతో గొప్ప విషయమని.. అలా వచ్చిన అవకాశాన్ని హర్షిత్ రాణా సరిగ్గా వినియోగించుకోవడంలేదని మండిపడ్డాడు. ప్రతి సంఘటనకు గొడవ పడడం ఏ మాత్రం కరెక్ట్ కాదన్నాడు. ప్రత్యర్ధులు ప్రతిక్షణం స్లెడ్జింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారని.. అలాంటప్పుడు ఓపిక చాలా అవసరమని తెలిపాడు. ఓపిగ్గా ఉండి… మ్యాచ్ పైన ఫోకస్ చేసిన వాళ్లు మాత్రమే సక్సెస్ అవుతారని వ్యాఖ్యానించాడు.

Advertisement

నిన్నటి మ్యాచ్ లో టీమిండియా క్రికెటర్లను కావాలనే పాకిస్తాన్ ఆటగాళ్లు డిస్ట్రబ్ చేశారని… దీంతో మనోళ్లు గొడవలకు దిగినట్టు వ్యాఖ్యానించాడు. అందుకే ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. ఓపెనర్ల నుంచి మొదలుకొని టైయిలండ‌ర్ల‌ వరకు అందరినీ హర్షిత్ రాణా గెలికాడని ఫైర్ అయ్యాడు. దీని వల్ల హర్షిత్ రాణాపై కచ్చితంగా ఐసీసీ చర్యలు తీసుకుంటుందని అంచనా వేశాడు. ఇకపై జరిగే మ్యాచ్ లో హర్షిత్ రాణా కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ అని సూచించాడు. ఇది ఇలా ఉండగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో చివరి వరకు తిలక్ వర్మ పోరాడినప్పటికీ టీమిండియా ఓడిపోయింది. పాకిస్తాన్ విధించిన 313 పరుగుల టార్గెట్ చేదించే క్రమంలో 265 పరుగులకు కుప్పకూలింది. దీంతో 48 పరుగుల తేడాతో పాక్ విక్టరీ అందుకుంది.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

Related News

టీమిండియాపై విజ‌యం..నేష‌న‌ల్ హాలీడే ప్ర‌క‌టించిన పాకిస్తాన్ ప్ర‌ధాని ష‌రీఫ్‌

వైభవ్ జోలికి వస్తార్రా? పాక్ బౌలర్ కాలర్ పట్టుకున్న అభిషేక్ శర్మ

టీమిండియా ఘోర ఓట‌మి..మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తూ రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్

పాక్ ప్లేయ‌ర్ల‌పై దాడి చేయాల‌ని హ‌ర్షిత్ రాణాను గంభీరే ఉసిగొల్పాడు

ఒరేయ్ తిల‌క్ వ‌ర్మ‌..టెస్టు మ్యాచ్ ఆడుతున్నావా? చేత‌కాక‌పోతే త‌ప్పుకో!

వైభ‌వ్ మ‌రోసారి ఫ్లాప్..స్కూల్ కు వెళ్లి ఆడుకోరా అంటూ పాక్ ప్లేయ‌ర్ల ర్యాగింగ్

తొలి బంతి నుంచి స్లెండ్జింగా? హ‌ర్షిత్ రాణాపై 2 ఏళ్లు బ్యాన్ వేయాల్సిందే

Big Stories

Advertisement
×