E-Paper
Advertisement

బాడీగార్డ్ వెధ‌వ ప‌నులు..త‌ల‌దించుకున్న విరాట్ కోహ్లీ, ఇంత‌కు ఎవ‌రీ సోను ?

బాడీగార్డ్ వెధ‌వ ప‌నులు..త‌ల‌దించుకున్న విరాట్ కోహ్లీ, ఇంత‌కు ఎవ‌రీ సోను ?
Advertisement

Virat Kohli Body Guard Controversy :   టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య వన్డే సిరీస్ ( India tour of England, 2026) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంటులో తొలి వన్డే పూర్తి కాగా, రెండో మ్యాచ్ ఆడేందుకు టీం ఇండియా సిద్ధమైంది. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ సాయంత్రం ఐదున్నర గంటలకు సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ లోని (Sophia Gardens, Cardiff) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ వివాదంలో చిక్కుకున్నాడు. తన బాడీగార్డ్ (Virat Kohli’s Bodyguard ) చేసిన వెధవ పని వల్ల… విరాట్ కోహ్లీ (Virat Kohli) తల దించుకోవాల్సి వచ్చింది. మీడియా ప్రతినిధులపై ఉరిమిపడ్డ విరాట్ కోహ్లీ బాడీగార్డ్ సోను… ఓ అభిమాని ఫోన్ కూడా పగలగొట్టాడట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తల ఎత్తుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read: Pakistan Cricket Board Fine To Kavya Maran For NOC: కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

బాడీగార్డ్ వెధ‌వ ప‌నులు..త‌ల‌దించుకున్న విరాట్ కోహ్లీ

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండవ టి20 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే ఇవాళ స్టేడియానికి ప్రత్యేక బస్సులో టీమిండియా ప్లేయర్లు చేరుకున్నారు. విరాట్ కోహ్లీ కూడా జట్టు ప్లేయర్లతో కలిసి వచ్చాడు. స్టేడియం దగ్గర చాలామంది అభిమానులు అటు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇందులో ఓ ప్రముఖ మీడియా ప్రతినిధి విరాట్ కోహ్లీ ఫోటోలు తీసేందుకు ప్రయత్నించాడు. అతడు అక్రిడేషన్ కార్డుతో పాటు… బీసీసీఐ జారీ చేసిన ఐడి కార్డు కూడా కలిగి ఉన్నాడు.

అంటే అసలు సిసలు జర్నలిస్ట్ అతడే అని చెప్పవచ్చు. అలాంటి జర్నలిస్టును… విరాట్ కోహ్లీ బాడీ గార్డ్ సోను వెనక్కి తోసేసాడు. F***ck అంటూ బండ బూతులు కూడా తిట్టాడు. అటు కొంతమంది అభిమానులు విరాట్ కోహ్లీ తో ఫోటోలు దిగేందుకు వస్తే… అందులో ఒకరి ఫోన్ కూడా పగలగొట్టాడట బాడీగార్డ్. ఈ సంఘటనకు సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ అయింది. దీంతో విరాట్ కోహ్లీ అవమానంతో తలదించుకున్నాడు. దీనిపై మీడియాకు విరాట్ కోహ్లీనే స్వయంగా క్షమాపణలు చెప్పాలని కూడా జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా జర్నలిస్టుకు గౌరవం ఇవ్వాల్సిందేనని కోరుతున్నారు.

కోహ్లీ బాడీగార్డ్ జీతం ఎన్ని కోట్లంటే?

Advertisement

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వ్యక్తిగత బాడీగార్డ్ సోను… లండన్ లోనే ఉంటూ… ఆ కుటుంబ బాగోగులు చూసుకుంటున్నాడు. విరాట్ కోహ్లీ ఫ్యామిలీపై ఈగ వాడకుండా చూసుకుంటున్నారు. అలాంటి సోనుకు ఏడాదికి 1.2 కోట్ల రూపాయల జీతం విరాట్ కోహ్లీ తన జేబులో నుంచి ఇస్తున్నారు. అంటే సాఫ్ట్వేర్, పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలు సంపాదించలేని జీతాన్ని విరాట్ కోహ్లీ బాడీగార్డ్ సోను అందుకు అంటున్నాడు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వివాహం కాకముందు నుంచే బాడీగార్డ్ గా పనిచేస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఎక్కడికి వెళ్లినా సోను ఉండాల్సిందే. అందుకే, తాజాగా మీడియా ప్రతినిధులపై కూడా ఓవరాక్షన్ చేశాడు సోను.

Also Read: ICC unveils new formats for Men’s ODI and T20 World Cups:  వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్ వ‌చ్చేసింది..టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మూడు మ్యాచ్ లు

 

 

 

Related News

ప్రతిరోజూ 1000 బౌన్సర్లతో నా కొడుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు..వైభవ్ తండ్రి సంచ‌ల‌నం

కోహ్లీ, గంభీర్ ఇద్ద‌రూ త‌న్నుకుంటుంటే..కుంభ‌క‌ర్ణుడిలా బీసీసీఐ నిద్ర‌పోతోంది!

IPLను దెబ్బ‌కొట్టేందుకు న‌ఖ్వీ భారీ ప్లాన్‌…PSL 2027 ప్రారంభంపై సంచ‌ల‌న నిర్ణ‌యం

శివుడి అవ‌తారమెత్తిన రోహిత్ శర్మ‌…ఫోటో చూపించిన దినేష్ కార్తీక్‌

కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్ వ‌చ్చేసింది..టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మూడు మ్యాచ్ లు

అప్పుడు గంభీర్ క్రెడిట్, ఇప్పుడు పిల్లాడి చిప్స్‌..అన్నీ దొంగిలించ‌డ‌మే? ధోనిపై ట్రోల్స్‌

Big Stories

Advertisement
×