IND W Squad for World Cup 2025 : భారత మెన్స్ జట్టు ని ఆసియా కప్ 2025 టీమ్ ని ప్రకటించిన మరికొద్ది సేపటికే తాజాగా భారత మహిళల క్రికెట్ జట్టు వరల్డ్ కప్ టీమ్ ని ప్రకటించింది. భారత మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, చీఫ్ సెలెక్టర్ నీతూ డేవిడ్ ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో ఆస్ట్రేలియా వన్డే సిరీస్, ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 కోసం జట్టు ను ప్రకటించేందుకు విలేకర్ల సమావేశంలో పాల్గొని ప్రకటించారు. ముఖ్యంగా ఇండియా ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 టీమ్ కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ గా స్మృతి మంధాన, ప్రతిక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రోడ్రిగ్యూస్, రేణుక సింగ్ ఠాగూర్, అరుంధతి రెడ్డి, రిచ ఘోస్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, అమంజొత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, స్నేహ్ రానా సెలెక్ట్ అయ్యారు.
Also Read : Hardik Pandya: SRH కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా…? లక్ష్మణ్ చేసిన ఆ ఒక్క తప్పిదంతో
షఫాలీ వర్మ కు నో ఛాన్స్..
యువ బ్యాటర్ షఫాలీ వర్మకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. గాయం కారణంగా చాలా కాలం నుంచి ఆటకు దూరంగా ఉన్న పేసర్ రేణుక ఠాకూర్ టీమిండియాలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ అమన్ జోత్ కౌర్ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించుకుంది. అదేవిధంగా తేజల్ హబ్నిస్, ప్రేమ రావల్, ప్రియా మిశ్రా, ఉమా చెత్రీ, మిన్నూ మణి, సత్ఘరే స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు. మహిళల ప్రపంచ కప్ టోర్నీ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్ లో భారత్ వర్సెస్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 05న భారత్, పాకిస్తాన్ జరగాల్సి ఉంది. అక్టోబర్ 12న ఆస్ట్రేలియా, అక్టోబర్ 19న ఇంగ్లాండ్, అక్టోబర్ 23న న్యూజిలాండ్, అక్టోబర్ 26న బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడాల్సి ఉంది.
వరల్డ్ కప్ కి ముందు ఆస్ట్రేలియాతో..
మహిళల వన్డే వరల్డ్ కప్ కి ముందు భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లోని తొలి వన్డే సెప్టెంబర్ 14న, రెండో వన్డే 17న, మూడో వన్డే సెప్టెంబర్ 20న జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం కేవలం ఒకే ఒక్క మార్పు మినహా వరల్డ్ కప్ ను ప్రకటించిన జట్టునే కొనసాగించనున్నారు. ఆసీస్ సిరీస్ లో అమన్ జోత్ స్థానంలో సయాలీ సత్ఘరే ఆడనుంది. ఒకే రోజు ఆసియా కప్ 2025 మెన్స్ టీమ్ ను.. ఇటు వరల్డ్ కప్ కోసం ఉమెన్స్ టీమ్ ను ప్రకటించడం గమనార్హం. అటు ఆసియా కప్ ను పురుషులు, వరల్డ్ కప్ ను టీమిండియా ఉమెన్స్ ఎలాగైనా సాధించాలనే తపనతో ఉన్నారు. ఈ కప్ లు సాధిస్తారో లేదో వేచి చూడాలి మరీ.