AR Murugadoss : కేవలం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ పీపుల్ కి మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్లకు కూడా మురగదాస్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఆయన తీసిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. అలానే డబ్బింగ్ రూపంలో కూడా విడుదలయ్యాయి. ఇకపోతే తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవి (megastar Chiranjeevi) హీరోగా స్టాలిన్(Stalin) అనే సినిమాను తీశారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.
స్టాలిన్ సినిమా విషయంలో మురగదాస్ కూడా అసంతృప్తి చెందినట్లు అప్పట్లో కథనాలు వినిపించాయి. వాస్తవానికి ఆ సినిమా క్లైమాక్స్ మురగదాస్ కి నచ్చలేదని అప్పుడు బాగా వార్తలు వచ్చాయి. అందుకే మహేష్ బాబు స్పైడర్(spider) సినిమా వరకు కూడా తెలుగులో ఇంకో సినిమా చేయలేదని అంటుంటారు. మొత్తానికి స్పైడర్ సినిమాతో కూడా పెద్ద రాడ్డే పెట్టాడు.
తెల్లార్లు అంటే కుదరదు
సికిందర్ సినిమా ఫీల్ అవ్వడం వెనక కారణం చెప్పాడు దర్శకుడు ఏఆర్ మురుగదాస్. సల్మాన్ ఖాన్ (Salman Khan) తో పనిచేయడం అనేది అంత ఈజీ కాదు. పగటిపూట సీన్స్ తీయాల్సి వచ్చినా కూడా మేము ఆ సీన్స్ రాత్రి షూట్ చేసేవాళ్లం. ఎందుకంటే సల్మాన్ ఖాన్ రాత్రి ఎనిమిది గంటల తరవాతే సెట్ కి వచ్చేవాడు. మేము కొన్ని సీన్స్ తీయాలంటే ఎర్లీ మార్నింగ్ తీసేవాళ్ళం. అందుకే చాలా సీన్లు వర్కౌట్ కాలేదు.
ఒక సీన్ లో నలుగురు పిల్లలు ఉంటే, మేము రాత్రి రెండు గంటలకు అది షూట్ చేసేవాళ్లం. మేము అప్పటికే బాగా అలసిపోయి ఉండేవాళ్లం. అని పలు రకాల మాటలు తమిళ్ ఇంటర్వ్యూలో చెప్పాడు మురగదాస్. దీనిని బట్టి సికిందర్ సినిమా చేసేటప్పుడు మురగదాస్ ఎన్ని కష్టాలు పడ్డాడు అర్థమవుతుంది. అయినా తెల్లార్లు షూటింగ్ చేయాలి అంటే కష్టమైన పని. సినిమా మీద సీన్స్ మీద ఉన్న ఎక్సైట్మెంట్ పోతుంది. ఆ ఎక్సైట్మెంట్ పోయినప్పుడు పని చేయడమే వేస్ట్. కొన్ని సీన్స్ రాత్రిపూట తీయాల్సి అవసరం వచ్చినప్పుడు తీయాలి. అంతేకానీ ప్రతిసారి చీటింగ్ చేస్తాం అంటే కుదరదు.
మదరాసి ఏమవుతుందో
ప్రస్తుతం శివ కార్తికేయన్ (sivakarthikeyan) హీరోగా మదరాసి అనే సినిమాను చేస్తున్నాడు మురగదాస్. ఈ సినిమా సెప్టెంబర్ ఐదున ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చేస్తున్నారు. అందుకే పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు. ఆ ఇంటర్వ్యూస్ లో కొన్ని సంచలనమైన విషయాలు చెబుతున్నాడు. అలా చెప్పిన విషయాలలో సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమా వార్త ఒకటి.
Also Read: Telugu Industry : దాసరి గారు లేరు… ఇక మెగాస్టార్ కాకపోతే ఇంకెవరు ?