BCCI Cash Prize: అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Under 19 World Cup 2026 ) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. నిన్న అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( England U19 vs India U19, Final ) మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో చివరి వరకు పోరాడిన ఇంగ్లాండ్ ఓడిపోగా.. టీమిండియా వంద పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ నేపథ్యంలో ఆరవసారి అండర్ 19 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా టీం ఇండియా అండర్ 19 జట్టు చరిత్ర సృష్టించింది. అయితే ఆరవ సారి టైటిల్ గెలిచిన టీమిండియా జట్టుకు బంపర్ ఆఫర్ తగిలింది. టీమిండియా జట్టుకు బిసిసిఐ భారీ నజరానా ప్రకటించింది.. ఏకంగా 7.50 కోట్ల ప్రైస్ మనీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది బీసీసీఐ. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.
అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఛాంపియన్గా నిలిచిన టీమిండియా జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ నజరానా ప్రకటించింది. ఎవరు ఊహించని రీతిలో 7.5 కోట్ల రూపాయల నగదును ఇచ్చేందుకు ముందుకు వచ్చింది బీసీసీఐ. ఐసీసీ టోర్నమెంట్ గెలిచిన ప్రతిసారి నజరానా ఇస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి, ఇప్పుడు అండర్ 19 టీమ్ ఇండియాకు కూడా భారీ నజరానా ప్రకటించింది. ఈ 7.5 కోట్ల నగదును టీమిండియా ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్, సెలెక్టర్లకు పంపిణీ చేయనున్నారు బిసిసిఐ పెద్దలు. బీసీసీఐ కాసుల వర్షం కురిపించిన నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు సంబరపడిపోతున్నారు.
ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న హరారే లోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 411 పరుగుల రికార్డు టార్గెట్ ఇంగ్లాండ్ ముందు ఉంచింది. ఈ సందర్భంగా టీమిండియా కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే సెంచరీ నమోదు చేశాడు. కేవలం 80 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్య వంశీ ఏకంగా 175 పరుగులు సాధించాడు. ఇందులో 15 సిక్సర్లు అలాగే 15 బౌండరీలు ఉన్నాయి. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఇంగ్లాండ్ తేలిపోయింది. దీంతో ఇంగ్లాండ్ పైన 100 పరుగుల తేడాతో టీమిండియా అండర్-19 జట్టు విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆరవసారి అండర్ 19 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా టీం ఇండియా అండర్ 19 జట్టు చరిత్ర సృష్టించింది. ఆరవ సారి టైటిల్ గెలిచిన టీమిండియా జట్టుకు బంపర్ ఆఫర్ తగిలింది. ఏకంగా 7.50 కోట్ల ప్రైస్ మనీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది బీసీసీఐ.