BCCI :-  క్రికెటర్లను చైనాకు పంపించేది లేదు.. తేల్చి చెప్పిన బీసీసీఐ

BCCI :-  క్రికెటర్లను చైనాకు పంపించేది లేదు.. తేల్చి చెప్పిన బీసీసీఐ

Share this post with your friends

BCCI :- ఏషియన్‌ గేమ్స్‌ ఈ ఏడాది చైనాలో జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 8 వరకు హాంగ్జౌ వేదికగా ఏషియన్‌ గేమ్స్‌ షెడ్యూల్ విడుదలైంది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లానే ఏషియన్‌ గేమ్స్‌లోనూ ఈసారి క్రికెట్‌ను ప్రవేశపెట్టారు. గతేడాది బర్మింగ్‌హమ్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు మహిళల క్రికెట్‌ జట్టును పంపించింది బీసీసీఐ. ఆ గేమ్స్‌లో ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో ఓడిన హర్మన్‌ సేన సిల్వర్‌ మెడల్‌ గెలుచుకుంది.

కామన్ వెల్త్ గేమ్స్‌లో ఆడించినందుకు ఏషియన్ గేమ్స్ లోనూ క్రికెట్ చేర్చారు. అయితే, ఒక్క క్రికెట్ తప్ప మిగిలిన విభాగాల్లో ఎంట్రీ పేర్లను చైనాకు పంపించారు భారత ఏషియన్‌ గేమ్స్‌ చీఫ్‌ భుపేందర్‌. మెన్, ఉమెన్ క్రికెట్‌ జట్లను చైనాకు పంపించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.

అయితే, ఇండియాతో చైనా వ్యవహారశైలి కారణంగానే క్రికెట్ జట్లను పంపించడం లేదా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. కాని, అది కారణం కాదంటున్నారు. ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగామ్‌-ఎఫ్‌టీపీలో భాగంగానే పంపించడం లేదని బీసీసీఐ తెలిపింది. సెప్టెంబర్ సమయంలో కొన్ని కమిట్‌మెంట్స్‌ ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది బీసీసీఐ.  ఏషియన్‌ గేమ్స్‌ సమయంలోనే ముఖ్యమైన ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఉన్నాయి. అందుకే భారత క్రికెట్‌ జట్లను చైనాకు పంపించకూడదని నిర్ణయించుకున్నామని బీసీసీఐ తెలిపింది.

ఎఫ్‌టీపీ ప్రకారం టీమిండియా మెన్స్‌ జట్టు అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో వన్డే ప్రపంచకప్‌ ఆడనుంది. అదే సమయంలో మహిళల జట్టు సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లతో సిరీస్‌లు ఆడనుంది. అయితే ఏషియన్‌ గేమ్స్‌ కూడా అప్పుడే జరుగుతున్నందున వేరే దారి లేక పోటీల్లో తాము పాల్గొనడం లేదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

అయితే ఏషియన్‌ గేమ్స్‌కు భారత క్రికెట్ జట్టు తరపున జూనియర్లను పంపిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ 1998లో కౌలలంపూర్‌ లో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత పురుషుల జట్టు పాల్గొంది. అదే సమయంలో పాకిస్తాన్‌తో టొరంటోలో మరో టీమిండియా జట్టు వన్డే సిరీస్‌ను ఆడింది. తాజాగా 2021లో భారత సీనియర్‌ జట్టు ఇంగ్లండ్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లగా.. శిఖర్‌ ధావన్‌ సారధ్యంలో జూనియర్‌ జట్టు శ్రీలంకలో వన్డే సిరీస్‌ ఆడిందని గుర్తు చేస్తున్నారు. 


Share this post with your friends

ఇవి కూడా చదవండి

HIT 2 Day 1 Collections: ‘హిట్ 2’ ఫస్ట్ డే కలెక్ష‌న్స్‌.. టైటిల్‌కు న్యాయం చేయాలంటే ఎంత రాబ‌ట్టాలంటే!

BigTv Desk

Adipurush : ‘ఆది పురుష్’ పోస్ట‌ర్‌పై వివాదం.. కేసు నమోదు

Bigtv Digital

Pink Flowers : గులాబీ రంగు పువ్వులు ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

BigTv Desk

Shraddha Walkar : శ్రద్ధావాకర్ హత్య కేసు.. 3 వేల పేజీలతో ఛార్జిషీట్ సిద్ధం..

Bigtv Digital

Hyd Rain: మళ్లీ సడెన్‌ రెయిన్.. ఈ నగరానికి ఏమైంది?

Bigtv Digital

Blood Cancer : బ్లడ్‌ క్యాన్సర్‌ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే

BigTv Desk

Leave a Comment