BigTV English

IPL 2025 Update: ఐపీఎల్ 2025 కొత్త షెడ్యూల్ వచ్చేసింది.. ఈ 3 మూడు వేదికల్లోనే మ్యాచ్ లు

IPL 2025 Update:  ఐపీఎల్ 2025 కొత్త షెడ్యూల్ వచ్చేసింది.. ఈ 3 మూడు వేదికల్లోనే మ్యాచ్ లు

IPL 2025 Update:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పునః ప్రారంభంపై కీలక అప్డేట్ వచ్చింది. తాజాగా.. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ పై భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మూడు వేదికలను BCCI షార్ట్ లిస్ట్ చేసింది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో మరో 16 మ్యాచులు మిగిలి ఉన్నాయి. ఈ 16 మ్యాచ్ లను కోసం మూడు వేదికలను ఫిక్స్ చేసింది. మొత్తం సౌత్ ఇండియాలోనే ఈ టోర్నమెంట్ నిర్వహించాలని… అలా అయితే ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండబోవని… భారత క్రికెట్ నియంత్రణ మండలి ఓ నిర్ణయానికి వచ్చింది.


Also Read: DC Vs PBKS: పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ రద్దు కాలేదు..మళ్ళీ మొదలు కానుంది.. ఎప్పుడంటే ?

ఇందులో భాగంగానే ఈ 16 మ్యాచ్ ల కోసం… బెంగళూరు, చెన్నై అలాగే హైదరాబాద్ మూడు వేదికలను షార్ట్ లిస్టు చేసింది. దీనిపై అధికారిక ప్రకటన కూడా మరికాసేపట్లో రాబోతుంది. అంటే ఈ లెక్క ప్రకారం మిగిలిన 16 మ్యాచులు ఈ మూడు వేదికల్లో మాత్రమే జరుగుతాయి.


ఈ 16 మ్యాచులు చాలా కీలకం. ప్లే ఆఫ్ ఆ తర్వాత సెమీస్ అలాగే ఎలిమినేట్ మ్యాచ్లు ఉంటాయి. చివరగా ఫైనల్ మ్యాచ్ కూడా ఉండనుంది. కాబట్టి… ఈ 16 మ్యాచ్ లు ఈ టోర్నమెంట్లో చాలా కీలకం. సౌత్ ఇండియా.. పాకిస్తాన్ కు దూరంగా ఉంటుంది. యుద్ధం జరిగిన కూడా.. హైదరాబాద్, బెంగళూరు అలాగే చెన్నై నగరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా ప్రమాదం జరిగిన కూడా జమ్మూ కాశ్మీర్ పంజాబ్, గుజరాత్ లేదా రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లోనే జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే సౌత్ ఇండియా నగరాలను ఎంచుకున్నారు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు.

అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపిఎల్ 2025 టోర్నమెంట్

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య గురువారం రాత్రి యుద్ధం ప్రారంభమైన నేపథ్యంలో… ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో గురువారం జరగాల్సిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ను రద్దు చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉండేది. కానీ ఈ మ్యాచ్.. ప్రారంభమైన కాసేపటి తర్వాత రద్దయింది. ఇక మరుసటి రోజు మధ్యాహ్నం సమయానికి అర్ధాంతరంగా వాయిదా పడినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నిరవధికంగా వాయిదా పడింది.

మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్

ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్… అర్ధాంతరంగా రద్దయిన సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా జరగాల్సిన మ్యాచ్… యుద్ధం కారణంగా రద్దయింది. అయితే ఈ మ్యాచ్…. ఎక్కడైతే రద్దయిందో అక్కడి నుంచి మళ్లీ ప్రారంభించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. ఆరోజున 10 ఓవర్లు పడిన పంజాబ్ కింగ్స్… 122 పరుగులు చేసింది. అక్కడి నుంచే మళ్లీ ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

 

Also Read: Vande Bharat Train: వందే భారత్ ట్రైన్ లో ఐపీఎల్ ప్లేయర్స్.. ఎంత ఖర్చు చేశారో తెలుసా ?

Related News

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Big Stories

×