DC Vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ టోర్నమెంట్ మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇవాళ లేదా రేపు కేంద్ర ప్రభుత్వంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India) అధికారులు చర్చలు నిర్వహించే ఛాన్సులు ఉన్నాయి. అనంతరం ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఎక్కడ ? ఎప్పుడు నిర్వహించాలనే దానిపైన క్లారిటీ రానుంది. మరో వారం రోజుల్లోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పునః ప్రారంభమవుతుందని చెబుతున్నారు.
Also Read: SRH vs KKR Tickets : BCCI కీలక ప్రకటన..ఐపీఎల్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి రిఫండ్
పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ మధ్య మళ్లీ మ్యాచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నిరవధికంగా వాయిదా పడే కంటే ముందు.. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Punjab Kings vs Delhi Capitals ) మధ్య మ్యాచ్ రద్దయింది. రెండు రోజుల కిందట అంటే గురువారం ఐపీఎల్ 2025 టోర్నమెంటులో భాగంగా జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ను అర్ధాంతరంగా రద్దు చేసింది ఐపీఎల్ యాజమాన్యం. ఆ రోజున పాకిస్తాన్ వర్సెస్ ఇండియా యుద్ధం ప్రారంభమైన నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ రద్దు అయ్యే సమయానికి… పంజాబ్ కింగ్స్ ( Punjab Kings ) 10 ఓవర్లు ఆడింది. 122 పరుగులు.. చేయడం జరిగింది.
10 ఓవర్లు పూర్తి కాగానే సైరన్ మోగించారు. స్టేడియంలో లైట్స్ మొత్తం ఆపేసారు. అనంతరం ప్లేయర్లు అందరినీ సేఫ్ ప్లేస్ లోకి తరలించారు. అనంతరం స్టేడియం కు వచ్చిన అభిమానులందరికీ వెళ్లగొట్టారు. ఐపీఎల్ అధికారులు రంగంలోకి దిగి స్టేడియాన్ని ఖాళీ చేయించారు. అయితే ఈ మ్యాచ్ గురించి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) మధ్య మ్యాచ్ను మళ్లీ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోయిందో అక్కడి నుంచి రీస్టార్ట్.. చేసేందుకు ఐపీఎల్ అధికారులు ఆలోచన చేస్తున్నారట. ఎప్పుడు ఐపీఎల్ పునః ప్రారంభమైన కూడా…. ఈ మ్యాచ్ మళ్లీ నిర్వహిస్తారు. ప్లే ఆఫ్ చేయాలంటే ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకము. అందుకే రద్దు కాకుండా.. మళ్లీ మ్యాచ్ నిర్వహించాలని అనుకుంటున్నారట.
ప్రత్యేక వందే భారత్ ట్రైన్ లో ప్లేయర్లు
ధర్మశాల వేదికగా రద్దయిన మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే పంజాబ్ కింగ్స్ ప్లేయర్లను ప్రత్యేక వందే భారత ట్రైన్ లో తరలించారు. వందే భారత్ ట్రైన్ లో ( Vande bharath train)… హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల ( Himachal Pradesh Dharamshala ) నుంచి ఢిల్లీకి ప్లేయర్లను తరలించారు.
Also Read: RCB Struggles: RCBని వెంటాడుతున్న దరిద్రం.. 100 టోర్నమెంట్లు వచ్చినా మీకు కప్పు రాదు