BigTV English

BCCI Secretary Jay Shah: దేశవాళీ టోర్నమెంట్లలో తప్పనిసరిగా ఆడాల్సిందే.. జై షా..!

BCCI Secretary Jay Shah: దేశవాళీ టోర్నమెంట్లలో తప్పనిసరిగా ఆడాల్సిందే.. జై షా..!

Jay Shah makes big statement on players not participating In Domestic Tournaments: బీసీసీఐ కాంట్రాక్టు పొందినంత మాత్రాన వారు జాతీయ జట్టులోనే ఆడతామంటే కుదరదని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ‌లో మాట్లాడుతూ.. ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లు, లేదా సెలవులు పెట్టి వెళ్లిన వాళ్లు బీసీసీఐకి అందుబాటులో ఉండటం లేదని అన్నారు. ఎంత గొప్ప ఆటగాళ్లయినా సరే, దేశవాళీ క్రికెట్‌లో ఆడాల్సిందేనని ఇషాన్ కిషన్‌ని ఉద్దేశించి అన్నారు. బీసీసీఐ కాంట్రాక్టు పొందిన ఆటగాళ్లు సాకులు చెప్పి, తప్పించుకుంటే ఇక నుంచి సహించబోమని అన్నారు.


“వారికి ఇప్పటికే ఫోన్‌లో సమాచారం అందించామని తెలిపారు. అలాగే నేను స్వయంగా లేఖలు రాయబోతున్నానని తెలిపారు. సెలక్షన్ కమిటీ చైర్మన్, హెడ్  కోచ్, కెప్టెన్‌ కోరితే, వారు తప్పనిసరిగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందేనని అన్నారు. ఇదే విషయాన్ని క్రికెటర్లందరికీ తెలియజేస్తున్నామని అన్నారు. ఇటీవల శ్రేయాస్ అయ్యర్ కూడా ఇదే మాట చెబితే, తను రంజీలు ఆడి, మళ్లీ టెస్ట్ జట్టులోకి వచ్చాడు.

Read More: అందరి మనసులు గెలుచుకున్న రోహిత్ శర్మే కెప్టెన్.. జైషా ప్రశంసలు..! 


ఈ విధానాన్నే అందరూ పాటించాల్సిందిగా జైషా చెబుతున్నారు. ఇదంతా కూడా ఇషాన్ కిషన్ కారణంగానే వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో  వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సమస్యతో ఇబ్బందులు పడుతోంది. అందుబాటులో ఉండి, ఇషాన్ కిషన్ ఓవరాక్షన్ చేయడం బీసీసీఐకి కాలింది. అందుకే ఈ నిబంధన తెచ్చారు.

దీంతో చచ్చినట్టు ఇషాన్ కిషన్ రంజీలు ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం రాహుల్ ద్రవిడ్ కూడా ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ ఆడక తప్పదని తేల్చి చెప్పాడు. ఈ దేశవాళీ టోర్నీల్లో ఆటగాళ్లు పాల్గొనడం జాతీయ క్రికెట్ అకాడమీ మార్గదర్శకానికి అనుగుణంగా జరుగుతుందని, అంతర్జాతీయ మ్యాచ్‌లకి ఇబ్బంది లేకుండా ఉంటుందని షా చెప్పారు.

ఒకరు వైట్ బాల్ క్రికెట్ బాగా ఆడతారు, ఒకరు రెడ్ బాల్ బాగా ఆడతారు. దీనిని మేం తెలుసుకోగలం. కానీ కుర్రాళ్లయి ఉండి, అన్నీ ఆడగలిగే శక్తి ఉండి, తప్పించుకు తిరగడం, దేశవాళీ క్రికెట్‌ను పక్కనపెట్టి, డబ్బులొచ్చే ఐపీఎల్‌కి శిక్షణ తీసుకోవడం లాంటి కుయుక్తులను సహించమని ఇన్‌డైరక్టుగా తెలిపారు. రెడ్ బాల్ క్రికెట్ ఆడకపోతే ఐపీఎల్ ఆడేందుకు అనర్హులనే నిబంధన విషయం కూడా సీరియస్‌గా పరిగణిస్తున్నామని తెలిపారు.

Tags

Related News

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

BCCI: కోహ్లీ, రోహిత్ కు ఎదురుదెబ్బ…2027 కోసం బీసీసీఐ కొత్త ఫార్ములా…గంభీర్ కుట్రలేనా ?

Rohit Sharma Lamborghini : రోహిత్ శర్మ కారు నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.. వాళ్లపై ప్రేమతో

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Big Stories

×