Rohit Sharma: బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా – ఇండియా జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఈమధ్య ముగిసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో సిడ్నీ వేదికగా జరిగిన చివరి ఐదవ టెస్ట్ కి రెస్ట్ పేరుతో కెప్టెన్ రోహిత్ శర్మని బెంచ్ కి పరిమితం చేశారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ బరిలోకి దిగలేదు. కానీ తనంతట తానే ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నానని రోహిత్ శర్మ ప్రకటించాడు.
Also Read: Virat Kohli – Anushka Sharma: ముంబైలో కోహ్లీ.. ఆ మిస్టరీ లేడీ భుజాలపై చేయి.. వీడియో వైరల్ !
ఈ క్రమంలో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఐతే తాను ఎక్కడికి వెళ్లడం లేదని, రిటైర్మెంట్ ప్రకటించడం లేదని స్పష్టం చేశాడు. నిజానికి బాక్సింగ్ డే టెస్ట్ తర్వాతే రోహిత్ శర్మ ఇక రిటైర్మెంట్ తీసుకోవాలని భావించాడట. కానీ సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఒత్తిడి చేయడంతో ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టారట. ఆయన మనసు మార్చుకోవడాన్ని కోచ్ గంభీర్ హర్షించకపోవడంతో ఆఖరి టెస్ట్ కి రోహిత్ శర్మ వైదొలిగినట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి.
ఇదిలా ఉంటే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ప్రదర్శనపై బీసీసీఐ నేడు సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. జట్టులో సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉందని.. ప్రతి ఒక్క ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని స్పష్టం చేసిందట బీసీసీఐ.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఆటగాళ్లు కూడా దేశవాళిలో ఆడాలని.. అప్పుడే జాతీయ జట్టులోకి తీసుకుంటామని బీసీసీఐ తేల్చి చెప్పిందట. ఒకవేళ గాయం కారణంగా ఏ ఆటగాడైనా మినహాయింపు కోరితే.. ఆ విషయంపై ఫిజియో క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా హెడ్ కోచ్, చీఫ్ సెలెక్టర్లు కూడా ఇందుకు అంగీకరించాలి. ఇక ఇదే సమయంలో టీమ్ ఇండియా భవిష్యత్ కెప్టెన్ ఎవరు..? అనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.
గత కొంతకాలంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహించడంలో విఫలమవుతున్నారని, జట్టు పగ్గాలు జస్ప్రీత్ బుమ్రాకి అప్పగించారని డిమాండ్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ గా బుమ్రా పేరుని రోహిత్ శర్మ ప్రతిపాదించారట. అయితే బుమ్రా విషయంలో కొందరు బీసీసీఐ పెద్దలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారట.
Also Read: Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్ ?
సుధీర్ఘ టెస్ట్ సిరీస్ లో జట్టును నడిపించగల ఫిట్నెస్ సామర్ధ్యం పై అనుమానాలు వ్యక్తం చేశారని, వరుసగా గాయాలు, ఫిట్నెస్ ని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ పెద్దలు ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోందట. బుమ్రా మళ్లీ పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాత కెప్టెన్ గా చేసేందుకు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.