BigTV English

Duleep Trophy: దులీప్‌ ట్రోఫీకి ఆ ముగ్గురూ తప్ప.. అందరూ ఆడాల్సిందే!

Duleep Trophy: దులీప్‌ ట్రోఫీకి ఆ ముగ్గురూ తప్ప.. అందరూ ఆడాల్సిందే!
BCCI want Test specialists to Play Duleep Trophy Rohit, Virat, Bumrah to be exceptions: కొత్త కోచ్ గౌతం గంభీర్ మార్క్ అప్పుడే స్పష్టంగా కనిపిస్తోంది. జాతీయ జట్టులోకి ఎంపికైన ఆటగాళ్లు ఎవ్వరూ కూడా దేశవాళీ క్రికెట్ లో ఆడటం లేదు. దాదాపు మరిచిపోయారనే చెప్పాలి. అది  తమ స్థాయి కాదనే స్థితికి వచ్చేశారు.  అంతేకాదు ప్రాక్టీస్ లేకుండా మ్యాచ్ లకు వెళ్లడం ఆడితే ఆడటం లేదంటే
బ్యాట్ పట్టుకుని వెనక్కి వచ్చేయడం ఆనవాయితీగా మారింది.


ఇప్పుడు కోచ్ గౌతంగంభీర్ వచ్చాడు. ఆ పప్పులేవీ ఉడకవని చెప్పాడు. సెప్టెంబరు 5న ప్రారంభమయ్యే దులీఫ్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఆటగాళ్లందరూ ఆడాలని తేల్చి చెప్పాడు. అయితే ఒక్క ముగ్గురికి మాత్రమే వెసులుబాటు కల్పించారు.

వారిలో జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఉన్నారు. అయితే చాలామంది అనేమాట ఏమిటంటే కొహ్లీకి హోమ్ సిక్ పట్టుకుంది. అందువల్ల తనచేత కూడా గట్టిగా ప్రాక్టీస్ చేయించాలని కామెంట్లు పెడుతున్నారు.


ఇకపోతే దులీఫ్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం బీసీసీఐ.. ఇప్పుడు ఏ, బీ, సీ, డీ పేరిట నాలుగు జట్లను ఎంపిక చేసింది. ఇందులో టీమిండియా ఆటగాళ్లను.. ఈ నాలుగు జట్లకు ఎంపికచేశారు. ఇప్పుడు ఆడనంటే కుదరదు. అందరూ తప్పనిసరిగా ఆడాల్సిందే. ఇటీవల శ్రేయాస్ అయ్యర్, ఇషాంత్ కిషన్ ఇలాగే ఆడకుండా బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యారు.

అయితే తర్వాత తెలివి తెచ్చుకున్న అయ్యర్ మళ్లీ ఆడి, ఇప్పుడు గంభీర్ పుణ్యమాని జట్టులోకి వచ్చాడు. మన తెలుగువాళ్లయిన ముగ్గరు క్రికెటర్లకు చోటు దక్కింది.

తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి బీ-టీమ్ లో ఆడుతున్నాడు.హైదరాబాద్ స్టార్ ఆటగాడు తిలక్ వర్మకు ఏ-టీమ్ లో స్థానం దక్కింది. ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్ డీ-టీమ్ కు ఎంపికయ్యాడు.

Also Read: కాసేపు నవ్వుతూ.. పెళ్లిపై మనుబాకర్ క్లారిటీ, అనుకోకుండా జరిగిపోయింది

జట్ల వివరాలు..

టీమ్-ఏ: శుభ్ మాన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కొటియాన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్ర, శాశ్వత్ రావత్.

టీమ్-బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, యశ్ దయాళ్, ముఖేశ్ కుమార్, రాహుల్ చహర్, సాయి కిశోర్, మోహిత్ అవస్థి, జగదీశన్.

టీమ్-సి: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్, సూర్యకుమార్ యాదవ్, బి.ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, వైశాఖ్ విజయ్ కుమార్, అన్షుల్ కాంభోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్, సందీప్ వారియర్.

టీమ్-డి: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, రికీ భుయ్, సారాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఆదిత్య తకారే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్ పాండే, ఆకాశ్ సేన్ గుప్తా, కేఎస్ భరత్, సౌరభ్ కుమార్.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×