BigTV English

T20 World Cup 2024: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో జర భద్రం!

T20 World Cup 2024: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో జర భద్రం!

Be careful with England and Australia Teams Senior cricketers Warns Rohit Sharma: ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న మ్యాచ్ లను చూస్తుంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు బలంగా ఉన్నాయని సీనియర్లు అంటున్నారు. ఆ రెండు జట్లతో జాగ్రత్తగా లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని అంటున్నారు. మరోవైపు చాలామంది అనే మాట ఏమిటంటే టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. అందువల్ల ప్రస్తుతం అన్ని జట్లలో టీమ్ ఇండియా చాలా డేంజరస్ అని చెబుతున్నారు.


ఇంతకీ ఆ స్టార్ ప్లేయర్స్ ఎవరంటే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లాంటి వాళ్ల పేర్లు చెబుతున్నారు. వీరందరూ ఒంటిచేత్తో మ్యాచ్ ని గెలిపించగల సమర్థులని అంటున్నారు.

అయితే ఆస్ట్రేలియాలో చూస్తే ట్రావిస్ హెడ్ చాలా ప్రమాదకారి అని చెబుతున్నారు. ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ తరఫున ఆడి ఎంత విధ్వంసం చేశాడో అందరికీ తెలిసిందే. అలాగే కమిన్స్ ఉన్నాడు.  క్లిష్ట సమయాల్లో అటు బ్యాటింగ్, ఇటు పేస్ బౌలింగ్ రెండూ చేయగల సమర్థుడిగా పేరుపొందాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ ఉండనే ఉన్నాడు.


అలాగే మ్యాక్స్ వెల్, కెమరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, జోస్ ఇంగ్లిష్ వీళ్లందరూ సమర్థులే. బౌలింగులో మిచెల్ స్టార్క్, జోష్ హేజల్ వుడ్, ఆడమ్ జంపా వీరెవరిని తక్కువ అంచనా వేయడానికి లేదని అంటున్నారు.

Also Read: అతడు లేకుండానే.. టీ 20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్.. నేడు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్

ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే.. కెప్టెన్ జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, ఆల్ రౌండర్లు మొయిన్ ఆలీ, శామ్ కర్రాన్, విల్ జాక్స్ ఉండనే ఉన్నారు. ఇక బౌలింగు విషయానికి వస్తే రీస్ టోప్లే, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, టామ్ హార్ట్ లీ ఇలా అందరూ దూకుడుగా ఉన్నారు. టీ 20 క్రికెట్ కి బ్రాండ్ అంబాసిడార్ లా మారిన ఇంగ్లాండ్ ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదని అంటున్నారు.

మరి మన టీమ్ ఇండియా చాలా డేంజరస్ అని చెబుతున్న ఆసిస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్, ఇతర సీనియర్ క్రికెటర్ల మాటలు రియాల్టీలో ఎంతవరకు నిజమవుతాయో వేచి చూడాల్సిందే.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×