BigTV English

India vs Bangladesh Warm-up Match: అతడు లేకుండానే.. టీ 20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్.. నేడు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్

India vs Bangladesh Warm-up Match: అతడు లేకుండానే.. టీ 20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్.. నేడు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్

Will Virat Kohli Miss India’s Warm-up Match Against IND vs BAN T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ సమరానికి మరొక్క రోజు దూరంలో ఉన్నాం. అయితే ఇప్పటికే అన్నిదేశాలు కూడా వార్మప్ మ్యాచ్ లు ఆడాయి. ఇంగ్లండ్, పాకిస్తాన్ లాంటి కొన్ని దేశాలు ఆడలేదు. ఇకపోతే మన టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ బంగ్లాదేశ్ తో నేటి రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.


కెనడా మ్యాచ్ మినహా న్యూయార్క్ వేదికగానే భారత్ అన్ని మ్యాచ్‌లు ఆడనుంది. అదే వేదికగా నేడు ప్రాక్టీస్ మ్యాచ్ కూడా జరగనుంది. పిచ్, వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా తుదిజట్టు కూర్పును సిద్ధం చేయాలని టీమిండియా భావిస్తోంది.

నేటి వార్మప్ మ్యాచ్‌కు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. సుదీర్ఘ ప్రయాణం చేసిన కోహ్లికి విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇప్పటికే కొహ్లీ ఐపీఎల్ లో అందరికన్నా ఎక్కువగా 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అందువల్ల ప్రాక్టీసు అవసరం లేదని కొందరు అంటున్నారు.


ఇక విదేశీ పిచ్ లపై టీమ్ ఇండియాకి అంత గొప్పగా ట్రాక్ రికార్డు లేదనే అంటున్నారు. అయితే అమెరికాలో పిచ్ లు చాలావరకు ఇండియా నుంచి తీసుకువచ్చారు. అందువల్ల ఇక్కడ పర్వాలేదు. ఆతర్వాత వెస్టిండీస్ లో మాత్రం టీమ్ ఇండియాకి గడ్డు కాలమే అంటున్నారు.

Also Read: ఆ ఒక్కడే టీమ్ ఇండియా బలమా?

ఎందుకంటే ఎప్పుడు వెస్టిండీస్ వెళ్లినా.. ఒకట్రెండు సందర్భాల్లో తప్ప నిరాశగానే టీమ్ ఇండియా జట్టు వెనుతిరిగింది. చాలా ఏళ్లుగా వెస్టిండీస్ లో క్రికెట్  పతనావతస్థకు చేరుకోవడంతో.. ఆ దేశంతో దైపాక్షిక సిరీస్ లు జరగలేదు. అయితే 2006లో ఆఖరిసారిగా వెస్టిండీస్ లో.. 5 వన్డే సిరీస్ లను రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో భారత్ ఆడింది. కాకపోతే ఒకటి గెలిచి, 4 మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది.

అందువల్ల టీమ్ ఇండియా అమెరికాలో గెలిచినా, వెస్టిండీస్ లో కలిసికట్టుగా స్టార్ ప్లేయర్లు అందరూ కలిసి ఆడితేనే గెలిచే అవకాశాలున్నాయని సీనియర్లు అంటున్నారు. కాకపోతే వార్మప్ మ్యాచ్ లో ఆడే జట్టు ఇలా ఉండవచ్చునని అంటున్నారు.

ఓపెనర్లు గా యశస్విజైశ్వాల్, రోహిత్ శర్మ, ఫస్ట్ డౌన్ విరాట్ లేకపొతే సంజూ శాంసన్ వస్తాడు. తర్వాత సూర్యకుమార్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా లేదా శివమ్ దూబె, తర్వాత నుంచి బౌలర్లు దిగుతారు. కులదీప్, బూమ్రా, అర్షదీప్ లేదా సిరాజ్ వస్తారని అంచనాలు వేస్తున్నారు.

Related News

Asia Cup 2025 : బంగ్లా చిత్తు… ఫైనల్ కు పాకిస్తాన్.. టీమిండియాతో బిగ్ ఫైట్

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్

PAK Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : స్మృతి మంధానకు ఘోర అవమానం… ఆ ఫోటోలు వైరల్ చేసి!

Abhimanyu Easwaran : 25 సెంచరీలు, 30 అర్థ శతకాలు చేసినా ఛాన్స్ దక్కడం లేదు…అభిమన్యు ఏం పాపం చేశాడు రా !

Inzamam-ul-Haq : అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్స్.. అందుకే దారుణంగా ఆడుతున్నాడు

Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Big Stories

×