Bengaluru Stampede: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} 2025 18వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {RCB} జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆర్సిబి ఐపిఎల్ టీం విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4వ తేదీన జరిగిన తొక్కేసలాట ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు.
మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు పై కబ్బన్ పార్క్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఆర్సిబి, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ {KCA} సహా తొక్కిసలాటతో సంబంధం ఉన్న పలువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
రంగంలోకి CID:
ఇక ఈ ఘటనను బీసీసీఐ కూడా సీరియస్ గా తీసుకుంది. మరోవైపు ఈ కేసును సిఐడీకి బదిలీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. సిఐడి ఎస్పి శోభన్విత నేతృత్వంలో దర్యాప్తు జరుగుతుంది. అలాగే రిటైర్డ్ న్యాయమూర్తి మైకేల్ డి కున్హ నేతృత్వంలో న్యాయ విచారణకు సైతం ఆదేశించారు. అయితే ఈ తొక్కీసలాట ఆకస్మికంగా జరిగిందా..? లేక ఇతరత్రా సంఘాలు, సంస్థల ప్రమేయం ఉందా..? అనే కోణంలో విచారించారు.
అయితే ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఏ శంకర్, కోశాధికారి ఈఎస్ జయరాం తమ పదవులకు రాజీనామా చేశారు. ఆర్సీబీ విజయోత్సవ వేడుకకు అనుమతి కోరుతూ కబ్బన్ పోలీసులకు మూడవ తేదీ రాత్రి సాయంత్రం 6 గంటలకు ఆర్సిబి వినతి పత్రం ఇచ్చింది. ఇందులో చిన్నస్వామీ స్టేడియంలో కార్యక్రమం నిర్వహిస్తారని పేర్కొన్నారు.
విరాట్ కోహ్లీ అరెస్టు తప్పదా!
అయితే ఇప్పుడు సిఐడి విచారణలో పలు కీలక విషయాలు బయటకు వచ్చినట్లు సమాచారం. ఆర్సిబి స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన భార్య పిల్లలతో కలిసి త్వరలో లండన్ లో స్థిరపడతారని, రిటైర్మెంట్ తర్వాత తన మిగిలిన జీవితాన్ని లండన్ లో గడపాలనుకుంటున్నాడట. గత కొన్నేళ్లుగా కోహ్లీ తరచూ లండన్ పర్యటనకు వెళ్లడం దీనికి బలం చేకూరుస్తుంది.
Also Read: Abdul Kalam on Dhoni: ధోనిపై అబ్దుల్ కలాంకు ఇంత నమ్మకమా… వాడు ఒక్కడుంటే చాలు అంటూ
ప్రస్తుతం కూడా విరాట్ కోహ్లీ లండన్ లోనే ఉన్నాడు. అయితే సిఐడి రిపోర్ట్ లో.. కోహ్లీ త్వరగా లండన్ వెళ్లిపోతాడని, అందుకే బెంగుళూరు యాజమాన్యం {RCB management } విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించిందట. పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి మరి పర్మిషన్స్ తీసుకున్నారట. దీనంతటికీ కోహ్లీ లండన్ వెళ్లడమే కారణం అని ఓ వార్త వైరల్ గా మారింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ పై కేసు పెట్టే అవకాశం కూడా ఉందని సమాచారం.