Suresh Raina Love Story: టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా గురించి క్రీడాభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత జట్టు తరఫున ఎన్నో కీలక ఇన్నింగ్స్ లు ఆడి.. మరపురాని విజయాలను అందించాడు. ఫార్మాట్ ఏదైనా.. ఎలక్ట్రిక్ ఫీల్డింగ్, పవర్ఫుల్ బ్యాటింగ్ తో.. అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించడం అతడి సొంతం. క్లిష్ట సమయాలలో భారత జట్టుకు, చెన్నై సూపర్ కింగ్స్ కి ఆక్సిజన్ లాంటి ఇన్నింగ్స్ ఇచ్చాడు.
Also Read: Abdul Kalam on Dhoni: ధోనిపై అబ్దుల్ కలాంకు ఇంత నమ్మకమా… వాడు ఒక్కడుంటే చాలు అంటూ
ముఖ్యంగా ఫీల్డింగ్ లో కళ్ళు చెదరే క్యాచ్ లను సైతం పొదుపుగా పట్టే నేర్పు రైనా సొంతం. సురేష్ రైనా భారత జట్టు తరుపున 322 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. ఇందులో మొత్తం 7,998 పరుగులు చేశాడు. ఇక 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో రైనా కీలక పాత్ర పోషించాడు. టీం ఇండియా తరఫున ఆడిన మ్యాచ్ లలో కంటే.. ఐపీఎల్ లో మెరుగైన పర్ఫామెన్స్ ఇవ్వడం వల్ల సురేష్ రైనా కి “మిస్టర్ ఐపీఎల్” అనే ట్యాగ్ వచ్చింది.
సురేష్ రైనా – ప్రియాంక చౌదరి ప్రేమకథ:
అయితే సురేష్ రైనా 2015లో ప్రియాంక చౌదరిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2015 వరల్డ్ కప్ తర్వాత సురేష్ రైనా కి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు నిర్ణయించారు. రైనా తల్లి తన స్నేహితురాలి కూతురితో అతడి వివాహం చేయాలని భావించింది. సురేష్ రైనా – ప్రియాంక చౌదరి చిన్నప్పటి నుండే స్నేహితులు. వీరి కుటుంబాలు పక్కపక్క ఇళ్లల్లో ఉండేవి. కొంతకాలం తరువాత వీరిద్దరూ మళ్ళీ కలుసుకున్నారు. అప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక 2015 వరల్డ్ కప్ లో సురేష్ రైనా ఆడిన మ్యాచ్లలో అద్భుతంగా ఆకట్టుకున్నాడు.
జింబాబ్వే తో జరిగిన లీగ్ మ్యాచ్ లో రైనా సెంచరీ చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 20 ఓవర్లలో 161 పరుగులు చేయాల్సి ఉండగా.. ధోని, రైనా చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించారు. ఇక ఈ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత వీరి వివాహ వేడుక ఉంటుందని అంతా భావించారు. కానీ వీరి వివాహం టీం ఇండియా టైట్ షెడ్యూల్ మధ్య హడావిడిగా జరిగింది. ఇలా వీరి వివాహం గురించి రైనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ” మేం 2015 వన్డే వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నాం. ఫైనల్ మ్యాచ్ మార్చ్ 29న ఉంది. ఆ తర్వాత రోజు మేము భారత్ కి రావడానికి ఏర్పాట్లు జరిగాయి. వరల్డ్ కప్ మధ్యలో ఐదు రోజుల గ్యాప్ రావడంతో.. కోచ్ రవి శాస్త్రి, మహి భాయ్ ని అడిగి బ్రేక్ తీసుకున్నాను.
ప్రియాంక కి రింగ్ తో ప్రపోజ్:
ఆ సమయంలో ఆమెని మిస్ అయితే జీవితాంతం బాధపడాల్సి ఉంటుందని చెప్పి ఒప్పించాను. ఇక పెర్త్ నుండి దుబాయి వెళ్లి, అక్కడినుండి లండన్ కి వెళ్లి.. అక్కడ ఉన్న ప్రియాంక కి రింగ్ తో ప్రపోజ్ చేశాను. మా ఇంట్లో వాళ్లకి తెలిసి వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేశారు. అనంతరం ఏప్రిల్ 1న బ్యాచిలర్ పార్టీ, ఏప్రిల్ 3న ఉదయం ఎంగేజ్మెంట్, సాయంత్రం పెళ్లి చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో ప్రియాంక నెదర్లాండ్స్ లో వర్క్ చేస్తుంది. ఆమె తల్లి, మా అమ్మ మంచి ఫ్రెండ్స్. దీంతో మా ఇద్దరికీ చిన్నప్పటినుండే స్నేహం ఉంది.
Also Read: Cricket Indoor stadiums: క్రికెట్… ఇండోర్ స్టేడియంలో ఎందుకు ఆడరు.. అసలు కారణాలు ఇవే
కానీ వాళ్ళు ఢిల్లీ నుండి పంజాబ్ వెళ్లిపోవడంతో.. మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆమెకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలియగానే వెళ్లి ప్రపోజ్ చేశాను. వెంటనే ఆమె తన తల్లితో చెప్పడం.. ఆమె మా అమ్మతో మాట్లాడడం, ఎంగేజ్మెంట్, పెళ్లి ఒకేరోజు పెట్టడం జరిగిపోయాయి. ముందుగా ఏప్రిల్ 3న ఎంగేజ్మెంట్, ఏప్రిల్ 8న పెళ్లి అనుకున్నారు. కానీ ఏప్రిల్ 8 నుండి ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవుతుంది. దీంతో ఒకేరోజు ఎంగేజ్మెంట్, పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. అలా ప్రపోజ్ చేయడానికి, ఇటు పెళ్లికి మధ్య ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాలేదు” అని చెప్పుకొచ్చాడు సురేష్ రైనా.