Abdul Kalam on Dhoni: ప్రపంచ క్రికెట్ చరిత్రలో మహేంద్రసింగ్ ధోని {MS Dhoni} చెరగని ముద్ర వేశాడు. భారత క్రికెట్ కి మహేంద్రసింగ్ ధోని అందించిన సేవలు మరియు అతని రికార్డ్ బ్రేకింగ్ ఫీట్ లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తారల ఔత్సాహిక క్రికెటర్లకు స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయి. టీమిండియాకి మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన ఘనత మహేంద్రసింగ్ ధోనీకి సొంతం.
Also Read: Cricket Indoor stadiums: క్రికెట్… ఇండోర్ స్టేడియంలో ఎందుకు ఆడరు.. అసలు కారణాలు ఇవే
ధోని నాయకత్వంలో..
2007లో మొదటిసారి ప్రవేశపెట్టిన టీ-20 ప్రపంచ కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ 2011, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2013 లను ధోని నాయకత్వంలోనే భారత్ గెలుపొందింది. తద్వారా భారత్ కి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ గా ధోని ఇప్పటికి కొనసాగుతున్నాడు. జట్టు గెలిచినప్పుడు ఉప్పొంగిపోడు, ఓటమికి కృంగిపోడు, ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా కూల్ గా డీల్ చేయడంలో ధోని తరువాతే ఎవరైనా.
క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత కూడా జనాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఓవైపు సినిమాలను కూడా నిర్మిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నాడు. దాదాపు 15 సంవత్సరాల పాటు భారత జట్టుకు తన వంతు సహాయం అందించడమే కాకుండా.. ఇండియన్ క్రికెట్ టీం యొక్క దశ దిశ మార్చిన కెప్టెన్ గా ధోనిని అభివర్ణించవచ్చు.
ఇక ఐపీఎల్ లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఐదుసార్లు ట్రోఫీని అందించి.. చెన్నై జట్టును ఐపిఎల్ లో టాప్ పొజిషన్ లో ఉంచాడు. ఇక ధోని క్రికెట్ ఆడుతున్నప్పుడు గ్రౌండ్ లో ఎంత పకడ్బందీ ప్లాన్స్ వేస్తూ ప్రత్యర్థి పై విజయాన్ని సాధిస్తూ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అతడు బ్యాటింగ్ లో ఉంటే.. ఆ మ్యాచ్ గెలుపు తథ్యం అని చెప్పుకోవచ్చు. మ్యాచ్ నీ ఆఖరి ఓవర్ వరకు తీసుకువెళ్లి.. ఫినిషింగ్ టచ్ ఇవ్వగలడు. అలాంటి ధోనీ గురించి ఒకానొక సందర్భంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా ప్రశంసలు కురిపించారు.
Also Read: Virat – Anushka: కోహ్లీ, అనుష్క పై దారుణంగా ట్రోలింగ్.. ఇండియా మ్యాచ్ కు వెళ్లకుండా అక్కడికి జంప్!
ధోనిపై అబ్దుల్ కలాం ప్రశంసలు:
వాస్తవానికి అబ్దుల్ కలాం టీవీ చూసేవారు కాదు. కానీ ఇండియా ఆడుతున్నప్పుడు క్రికెట్ స్కోర్ అడుగుతుండేవారట. ఆ సమయంలో భారత జట్టు కొంచెం కష్టాల్లో ఉందని చెబితే.. ” ధోని ఉన్నాడుగా.. అతడు చూసుకుంటాడులే” అని అనేవారట. అలా అబ్దుల్ కలాం మాత్రమే కాదు.. 100 కోట్ల మంది అభిమానులు కూడా అదే మ్యాజిక్ కోసం చూసేవారు. ఇక అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో కూడా ఫేర్వెల్ మ్యాచ్ ఆడలేదు ధోని. ఫేర్వెల్ స్పీచ్ కూడా ఇవ్వలేదు. కేవలం రెండే రెండు వ్యాఖ్యల్లో రిటైర్మెంట్ ప్రకటించాడు.